దూకుడు పెంచిన ప్రియమణి

- Advertisement -

“ఎవరే అతగాడు” సినిమాతో తెలుగు వెండితెరకు పరిచమైన కథానాయిక ప్రియమణి. ఈ సినిమా పెద్దగా ఈ కేర‌ళ కుట్టికి పేరు తీసుకురాక‌పోయిన‌.. ఆ త‌ర్వాత న‌టించిన ‘పెళ్ల‌యిన కొత్త‌లో, య‌మ‌దొంగ‌, శంభో శివ శంభో, సాధ్యం, ర‌గ‌డ’ వంటి సినిమాల‌తో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. సినీ కెరియ‌ర్ రైయ్ రైయ్ మంటూ దూసుకుపోతున్న త‌రుణంలోనే ఈ హాట్ బ్యూటీ పెళ్లి చేసుకుంది.

ఒప్పుడు స్టార్ హీరోయిన్ రేసులో ఉన్న ముద్డుగుమ్మ వివాహం చేసుకోవ‌డంతో కాస్త వెనుక‌బ‌డింది. దీంతో కొంత కాలం సినిమాల‌కు దూరంగా ఉన్నారు. అయితే, ప‌లు టీవీ షో కార్య‌క్ర‌మాల్లో న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రిస్తూ.. ప‌లు బుల్లితెర కార్య‌క్ర‌మాల‌లో మెరుస్తోంది. ప్ర‌స్తుతం ఆమె వెండితెర సెంకండ్ ఇన్నింగ్స్ ను మొద‌లుపెట్టింది. ప్ర‌స్తుతం త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘అసురాన్’ తెలుగు రీమేక్ ‘నార‌ప్ప’ సినిమాలో న‌టిస్తోంది.

అలాగే, ద‌గ్గుపాటి యంగ్ హీరో రానా క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న వీరాట‌ప‌ర్వం సినిమాలోనూ ప్రియ‌మ‌ణి ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. అయితే, విరాట‌ప‌ర్వం, నార‌ప్ప సినిమాల్లో చాలా వైవిధ్య‌మైన ఇదివ‌ర‌క‌టి న‌టించ‌ని పాత్ర‌ల్లో న‌టిస్తూ దూసుకుపోతోంది. వీటితో పాటు సిరివెన్నెల అనే ఓ హార‌ర్ సినిమాతో పాటు మ‌రో మూడు నాలుగు సినిమాలకు ప్రియ‌మ‌ణి సైన్ చేసింద‌ట‌.

తెలంగాణ శాసనమండలిలో కరోనా కలకలం

బుల్లితెరపై అదరగొట్టబోతున్న విజయ్ సేతుపతి

స‌మ్మ‌ర్ స్పెష‌ల్.. ప‌చ్చిమామిడి కాయ జ్యూస్

స్వల్పంగా తగ్గిన బంగారం ధ‌ర‌లు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… ప్ర‌యివేటుకు ఇసుక తవ్వకాలు

వామ్మో ఎక్కువ నిద్రపోతే అంతేనట !

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -