Wednesday, April 24, 2024
- Advertisement -

స‌మ్మ‌ర్ స్పెష‌ల్.. ప‌చ్చిమామిడి కాయ జ్యూస్

- Advertisement -

స‌మ్మ‌ర్ రానే వ‌చ్చింది. చూస్తుండ‌గానే ఎండ‌లు దంచి కొడుతున్నాయి. ఇలాంటి సమ‌యంలో శ‌రీరానికి త‌గినంత నీరు ల‌భించే ఆహారం తీసుకోవ‌డం ముఖ్యం. అందులో స‌మ్మ‌ర్ చ‌ల్ల‌చ‌ల్ల‌గా జ్యూస్ తాగితే.. శ‌రీరానికి త‌గినంత చ‌ల్ల‌ద‌నంతో పాలు రోగ‌నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. స‌మ్మ‌ర్ లో ఇలాంటి లాభాలు క‌లుగ‌జేస్తే జ్యూస్‌ల‌లో వెరీవెరీ స్పెష‌ల్ ప‌చ్చిమామిడి కాయ జ్యూస్.

ప‌చ్చిమామిడి కాయ జ్యూస్ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలోని వేడి త‌గ్గ‌డంతో పాటు చ‌ల్లద‌నాన్ని క‌లిగిస్తుంది. అతి దాహాన్ని తీరుస్తుంది. మామిడిలో ఉండే విట‌మిన్-సీ తో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. గొంతుపూత‌తో పాటు చిగ‌ళ్ల నొప్పిని త‌గ్గిస్తాయి. మామిడిలో ఉండే పెక్టిన్ అజీర్థిని త‌గ్గిస్తుంది. ఇందులో తీపీ త‌క్కువ‌గానే ఉంటుంది కాబ‌ట్టి బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఇది మంచి ఔష‌ధంలా ప‌నిచేస్తుంది.

మ‌న‌కు ఇన్ని లాభాలు క‌లుగ‌జేసే ప‌చ్చి మామిడికాయ‌ల జ్యూస్ త‌యారు చేసుకోవ‌డ చాలా సుల‌భం. దీనికి
కావాల్సిన ప‌ద‌ర్థాలు:
1. మామిడికాయ ముక్కలు – 250 గ్రాములు
2. పంచదార – 750 గ్రాములు
3. యాలకులు – రెండు
4. కుంకుమపువ్వు – చిటికెడు
5. నీళ్లు – నాలుగు కప్పులు.

త‌యారు చేయు విధానం:

ప‌చ్చి మామిడి కాయ‌ల‌ను శుభ్రంగా కడిగి, పై చెక్కు తీసి ముక్కలుగా క‌ట్ చేసుకోవాలి. క‌ట్ చేసిన ముక్క‌ల‌ను ఓ గిన్నెలో తీసుకుని నీళ్లు పోసి ఉడికించాలి. ఆ తరువాత పంచదార వేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని చల్లార్చి.. అందులో యాలకులు, కుంకుమ పువ్వు వేసి మిక్సీ పట్టుకోవాలి. ప‌చ్చిమామిడి జ్యూస్ రెడీ ! ఈ రసాన్ని ఫ్రిజ్‌లో పెట్టి మధ్యాహ్నంపూట తాగితే శరీరానికి చలువ చేస్తుంది. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

స్వల్పంగా తగ్గిన బంగారం ధ‌ర‌లు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… ప్ర‌యివేటుకు ఇసుక తవ్వకాలు

వామ్మో ఎక్కువ నిద్రపోతే అంతేనట !

మందుకొడితే.. ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతారో తెలుసా ?

శృతిహాస‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం !

ఇటలీలో అన‌సూయ హ‌ల్‌చ‌ల్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -