Friday, April 26, 2024
- Advertisement -

తెలంగాణ శాసనమండలిలో కరోనా కలకలం

- Advertisement -

దేశంలో గత కొంత కాలంగా కరోనా వైరస్ ప్రభావం తగ్గినట్టు కనిపించింది.. కానీ చాపకింద నీరులా వ్యాపిస్తూ ప్రస్తుతం పంజా విసురుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. అయితే, తాజాగా తెలంగాణ శాసన మండలిలో కరోనా కలకలం రేపింది. ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించారు.

‘‘ తాజాగా కరోనా పరీక్ష‌లు చేయించుకున్నాను. ర్యాపిడ్ టెస్టులో నెగెటివ్ రాగా… ఆర్టీపీసీఆర్ టెస్టులో పాజిటివ్ గా వ‌చ్చింది’’ అని తెలిపారు. అలాగే, గత ఐదు రోజులుగా తనను కలిసిన వారు సైతం కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కొన్ని రోజులు హోం ఐసోలేషన్ లో ఉండాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. పురాణం సతీశ్ కరోనా సోకడంతో శాసన మండలిలో కలకలం రేపుతోంది.

ఎందుకంటే ఇటీవల జరిగిన శాసన మండలి సమావేశాలకు (శనివారం) ఆయన హాజరయ్యారు. దీంతో శసన మండలి సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో స‌న్నిహితంగా మెలిగిన వారంద‌రూ కోవిడ్‌-19 ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఇదిలా ఉండ‌గా, క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌ను ఈ నెల 26 కంటే ముందుగానే ముగించే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. కాగా, తాజాగా తెలంగాణ‌లో 337 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

బుల్లితెరపై అదరగొట్టబోతున్న విజయ్ సేతుపతి

స‌మ్మ‌ర్ స్పెష‌ల్.. ప‌చ్చిమామిడి కాయ జ్యూస్

స్వల్పంగా తగ్గిన బంగారం ధ‌ర‌లు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… ప్ర‌యివేటుకు ఇసుక తవ్వకాలు

వామ్మో ఎక్కువ నిద్రపోతే అంతేనట !

మందుకొడితే.. ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతారో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -