గత ఏడాది నుంచి దేశ వ్యాప్తంగా కరోనా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కరోనా ప్రభావం ఎక్కువగా విద్యారంగంపై పడింది. విద్యా సంస్థలు మూత పడటం.. ఆన్ లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులకు పాఠాలు బోదించడం జరిగింది. అయితే ఆన్ లైన్ క్లాసులకు కొంత వరకు మాత్రమే పిల్లలు సుముఖత చూపించినట్లు తెలుస్తుంది.
ఈ మద్యనే విద్యా సంస్థలు మళ్లీ ఓపెన్ చేసుకోవడానికి ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. తొమ్మిదవ తరగతి నుంచి పీజీ వరకు మళ్లీ మొదలయ్యాయి. తాజాగా పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 17 నుంచి 26 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది ఆరు పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ పరీక్షలు జరుపుతామని అధికారులు వెల్లడించారు.
పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. ఈనెల 25 వరకు పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం ఇచ్చింది. రూ.50 ఆలస్య రుసుముతో మార్చి 3 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో మార్చి 12 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో మార్చి 16 వరకు గడువు ఇచ్చింది.
అరటాకులో భోజనం ఎందుకు మంచిదో తెలుసా?
30 ఏళ్ల కష్టాన్ని.. అర్థ గంట లో దోచేశారు..!
విజృంభిస్తున్న విషజ్వరాలు.. ఎందుకంటే అక్కడ..!