- Advertisement -

పులిబిడ్డ… బాహుబ‌లి…

- Advertisement -
Tiger Cub Named Baahubali

బాహుబ‌ళి 2 సినిమా దేశంలో ఎంత‌ సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికీ తెలిసిందే. అదే బాహుబ‌ళి పీవ‌ర్ రాజ‌కీయాల‌కు అంటుకుంది.ఇప్పుడు ఏకంగా ఓ పులి బిడ్డ‌కు బాహుబ‌ళి అని పేరు పెట్టారు జూ అధికారులు.

భువ‌నేశ్వ‌ర్‌లోని న‌గ‌ర వివారు ప్రాంతాల‌లోఉన్న నంద‌న్‌కాన్ జంతుప్ర‌ద‌ర్శ‌న శాల‌లో విజయ, మేఘ, స్నేహ అనే మూడు పులులు ప్రసవించిన 7 పులిపిల్లలకు బుధవారం జూ అధికారులు నామకరణం చేశారు. సినీ రంగంలో సంచలనం సృష్టించిన బాహుబలి పేరును వీటిలో ఒక పిల్లకు పెట్టేందుకు అధికారులు నిర్ణయించారు. బాహుబలి నామకరణం ఖరారు చేయడం వెనక బలమైన ప్రజాభిప్రాయం ఉండడం మరో విశేషం.

{loadmodule mod_custom,Side Ad 1}

నందన్‌కానన్‌కు పలు ప్రాంతాల నుంచి విచ్చేసే పర్యాటకులను కొత్తగా జన్మించిన పులి పిల్లలకు పేర్లను ప్రతిపాదించాలని అధికారులు కోరారు. ఈ క్రమంలో పర్యాటకులు పేర్లను ప్రతిపాదించారు. ప్రజాభిప్రాయంలో అత్యధికంగా 52 శాతం మంది బాహుబలి పేరును ప్రతిపాదించ‌డంతో ప్రజాభిప్రాయానికి పట్టం గడుతూ ఒక పులిపిల్లకు బాహుబలి పేరును ఖరారు చేశారు. మిగిలిన 6 పులి పిల్లలకు కుందన్, సాహిల్, ఆద్యాశ, చిన్ను, విక్కి, మౌసుమిగా పేరు పెట్టారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -