పవన్ ఈ మధ్య తిరపతిలో అదే విధంగా కాకినాడ బహిరంగ సభలో తన దగ్గర డబ్బులు లేవని.. సినిమా చూసి హిట్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి అని పవన్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే పవన్ ఒక్కో సినిమా కి 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారు. అలాంటి పవన్ దగ్గర డబ్బులు లేకపోవడం ఏంటి అని పవన్ పై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అయితే పవన్ లైఫ్ స్టైల్ పై ఓ ప్రముఖ ఇంగ్లీష్ జాతీయ దిన పత్రిక ఆసక్తికర కథానాన్ని ప్రచురించింది.
పవన్ తన కుటుంబం కోసం కాని.. తన కోసం కానీ చేసింది ఏమీ లేదు అని.. మాములు జీవితాన్ని గడుపుతున్న పవన్ దగ్గర ఎప్పుడు ఉండే 12 మంది స్టాప్.. అలాగే పవన్ ఫామ్ హౌస్ లో ఉండే 25 మంది స్టాప్ ను ఎలాంటి లోటు లేకుండా చూసుకోవడానికి వారి జీతాలను ఇవ్వడానికే పవన్ కు చాలా ఖర్చు అవుతోందని.. ఆ పత్రిక చెబుతోంది. అంతే కాకుండా పవన్ బయటకు వచ్చినప్పుడు అభిమానుల నుంచి వచ్చే తాకిడిని తట్టుకోవడానికి పవన్ చుట్టు ఎప్పుడు 12 సెక్యూరీటీ సిబ్బందికి ఇచ్చే జీతాలు చాలా ఎక్కువ అని ఆ పత్రిక వెల్లడించింది.
పేరుకి పవన్ 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న 2013 అత్తారింటికి దారేది సినిమా తర్వాత పవన్ చేసింది కేవలం రెండు సినిమాలు మాత్రమే అనే విషయంను చాలా మంది పరిగనించకుండా… కేవలం పవన్ 20 కోట్ల రెమ్యునరేషన్ గురించి మాత్రమే పరిగనిస్తున్నారు అని కామెంట్ చేసింది ఆ పత్రిక. పవన్ మంచి వ్యక్తి కావడంతో ఎవరు కష్టాల్లో ఉన్న ఇట్టే కరిగిపోతాడు అని ఆ పత్రిక చెబుతోంది. అంతే కాకుండా ఇటివలే జరిగిన కాకినాడ బహిరంగ సభ కూడా పవన్ ఎవరిని డబ్బు అడగకూడా ఆ సభకు కావాల్సిన ఖర్చు మొత్తం పవనే భరించడని ఆ పత్రిక అంటుంది. అయితే సభలు పెడితే ఆయా నాయకులు విరాళాలు సెకారిస్తారు అని కానీ పవన్ అలా చేయకూండా తన సొంత డబ్బునే వాడుకున్నాడు అని ఇంతటి అద్భుత నాయకుడు ఉండటం నిజంగా గ్రేట్ అని ఆ పత్రిక పవన్ పై సంచలన వ్యాఖ్యాలు చేసింది.
Related