Friday, May 17, 2024
- Advertisement -

టీడీపీకి కొత్త కష్టాన్ని తీసుకొచ్చిన టీఆర్ఎస్..!

- Advertisement -

ఇప్పటికే తెలంగాణ తెలుగుదేశం పార్టీ ని తెగ ఇబ్బంది పెట్టేస్తూ వస్తోంది తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకా… ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారాన్ని సాధించుకొన్నాకా.. ఈ పార్టీ విజృంభిస్తోంది. తెలుగుదేశం తరపున గెలిచిన ఎమ్మెల్యేలను తెరాస తనవైపుకు తిప్పుకొంటోంది. అధికారాన్ని ఉపయోగించుకొని ఇలా టీడీపీని ముప్పుతిప్పలు పెడుతున్న తెరాస ఇప్పుడు టీడీపీపై మరో అస్త్రాన్ని సంధించింది.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కోటాలో.. శాసనమండలికి జరగబోయే ఎన్నికల్లో ఐదో అభ్యర్థిని బరిలో నిలపాలని డిసైడ్ చేసింది తెలంగాణ రాష్ట్ర సమితి. వాస్తవ బలాబలాలను బట్టి చూస్తే.. తెరాసకు కేవలం నాలుగు సీట్లు మాత్రమే దక్కుతాయి. ఐదో సీటు దక్కే అవకాశం ఉండదు. ఈ ఐదో సీటు తెలుగుదేశం పార్టీ ఖాతాలోనిది. అయితే తెరాస ఐదో అభ్యర్థిని బరిలో నిలపడం ద్వారా ఇప్పుడు టీడీపీని ఇబ్బంది పెడుతోంది.

ప్రస్తుత బలాబలాను బట్టి చూస్తే.. కనీసం 18 మంది ఎమ్మెల్యేల బలంతో ఒక ఎమ్మెల్సీ సీటును గెలుచుకొనే అవకాశం ఉంటుంది. తెరాసకు ఐదో అభ్యర్థి విషయంలో అంత బలం లేదు. అయినా ఐదో అభ్యర్థిని బరిలో నిలుపుతోంది. ఆ అభ్యర్థిని గెలిపించుకవోడానికి తెరాస తెలుగుదేశం ఎమ్మెల్యేలను చీల్చే అవకాశం ఉంది. ఆ చీలిక ఆశలతోనే తెరాస ఐదో అభ్యర్థిని నిలిపిందనేది కూడా వాస్తవం. మరి తెరాస వద్ద అధికారం ఉంది. ఈ ధైర్యంతోనే అభ్యర్థిని నిలిపింది. మరి ఎంత మంది ఇప్పుడు గులాబీ పార్టీ ఎన్ని పచ్చ చొక్కాలను తన వైపుకు తిప్పుకొంటోందో.. ఏ ధైర్యంలో అభ్యర్థిని నిలిపిందో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -