Saturday, May 3, 2025
- Advertisement -

లాహోర్‌లో బాంబు పేలుడు.. ఇద్దరు మృతి

- Advertisement -

పాకిస్తాన్ లోని లాహోర్ లో బుధవారం జరిగిన పేలుడులో ఇద్దరు మృతి చెందగా 16 మంది గాయపడ్డారు. మరో 17 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ముంబై పేలుళ్ల సూత్రధారి జమా ఉద్ దావా చీఫ్ హఫీజ్ మహమ్మద్ సయీద్ ఇంటికి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. గ్యాస్ పైప్ లైన్ వల్ల ఇది జరిగిందా లేక సిలిండర్ పేలిందా అన్నది ఇంకా నిర్ధారించుకోవలసి ఉందని పోలీసులు అంటున్నారు.

ఈ పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ళు, భవనాల కిటికీల అద్దాలు నాశనమయ్యాయి. పేలుడు తీవ్రతకు అక్కడ పెద్ద గొయ్యి ఏర్పడిందని ఆయన చెప్పారు. క్షతగాత్రులను జిన్నా హాస్పిట‌ల్‌కు త‌ర‌లించినట్టు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని నగర డిప్యూటీ కమిషనర్ రియాజ్ మాలిక్ తెలిపారు.

అయితే ఈ పేలుడుకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉస్మాన్ బజ్ దూర్ డిమాండ్ చేశారు. జోహార్ టౌన్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెంటనే నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు.

సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు!

బాలీవుడ్ లో పక్కపక్కన ఉంటున్న స్టార్స్ వీళ్ళే!

కర్నూల్ లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -