Friday, April 26, 2024
- Advertisement -

పెళ్లి చేసుకొని ఒక్కటైన గుత్తా జ్వాల, విష్ణు విశాల్!

- Advertisement -

క్రీడారంగంలో గుత్తా జ్వాల పెరు తెలియని వారు ఉండరు. ఆటలోనే కాదు.. అందం, కాంట్రవర్సీ ఒక్కటేమిటి ఏదైనా గుత్తా జ్వాల సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. గత కొంత కాలంగా నటుడు విష్ణు విశాల్ ప్రేమలో మునిగి తేలిపోతూ వస్తున్న ఈ అమ్మడు వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ మధ్యాహ్నం వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది.

హైదరాబాదులోని మొయినాబాదులో జరిగిన పెళ్లికి కొద్ది మంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఎక్కువ మందిని పెళ్లికి ఆహ్వానించలేదు. వాస్తవానికి గుత్తా జ్వాల క్రీడా రంగంలో ఎంత పాపులర్ అయ్యిందో.. సినీ రంగంలో నటించకున్నా పాపులర్ మాత్రం అయ్యింది.

ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటులతో ఈ అమ్మడికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. వధూవరులకు సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొన్నేళ్లుగా జ్వాల, విష్ణు విశాల్ ప్రేమలో ఉన్నారు. గత ఏడాది సెప్టెంబరులో వీరి నిశ్చితార్థం జరిగింది. గుత్తా జ్వాలకు ఇది రెండో వివాహం అన్న సంగతి తెలిసిందే.

‘జాతిరత్నాలు’ సీక్వెల్ రాబోతుందా?

సల్మాన్ ఖాన్ ‘రాధే’ట్రైలర్ రిలీజ్.. సీటీమార్స్ స్పెషల్..

మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్‌కు కరోనా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -