Friday, May 17, 2024
- Advertisement -

అసలు దోషి ఎవరు? పాపం ఎవరిది? నేరస్థుడు ఎవరు?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఈనాడు మీడియా సంస్థలతో పాటు చాలా వ్యాపారాలు నిర్వహిస్తున్న రామోజీరావు, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణలు ముగ్గురూ ఒకేతాను ముక్కలు అని చెప్పడానికి సందేహం అక్కర్లేదు. చంద్రబాబు ప్రత్యక్షంగా అధికారాన్ని అనుభవిస్తూ ఉంటాడు. రామోజీ, రాధాకృష్ణలు మాత్రం చంద్రబాబును అధికారంలోకి తీసుకువచ్చేలా ప్రచార వ్యూహాలు రచించడం, ప్రత్యర్థులను రాక్షసులుగా చిత్రీకరించడంలాంటి అబద్ధపు ప్రచారాలు చేయడంలాంటివి చేస్తూ చంద్రబాబు నుంచి ప్రయోజనాలు పొందుతూ ఉంటారని సీనియర్ జర్నలిస్టులు, విశ్లేషకుల నుంచి ప్రజల వరకూ అందరూ కూడా కచ్చితమైన ఆధారాలతో చెప్తూ ఉంటారు. అయితే ఉమ్మడిగా ఉండే ఈ ముగ్గురులో ఇప్పుడు ఒక నేరానికి సంబంధించిన విషయంలో అసలు నేరస్థుడు ఎవరో తేలాల్సిన సమయం వచ్చింది.

పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి దాదాపు ముఫ్ఫై మంది భక్తులు చనిపోయారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చంద్రబాబును సూపర్ హీరోగా, మాస్ జనాల దేవుడిగా చూపిస్తూ తీయాలని తలపెట్టిన పబ్లిసిటీ వీడియో కోసం ఎక్కువ మంది ప్రజలు ఫ్రేంలోకి వచ్చేలా భక్తులందరినీ ఒకే దగ్గరకు పంపించడంతో ఒత్తిడి ఎక్కువై ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వీడియోలు చూస్తే కూడా అదే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇప్పుడు చంద్రబాబు సారథ్యంలో పనిచేసిన, చంద్రబాబు కోసం పనిచేసిన ఒక కమీషన్ మాత్రం ఏళ్ళపాటు కాలక్షేపం చేసిన తర్వాత ఆ మరణాలకు చంద్రబాబు కారణం కాదని చెప్తున్నారు. అయితే అతిగా ప్రచారం చేయడం వళ్ళ జనాలు ఎక్కువ మంది రావడం, అదే టైంలో చంద్రబాబు కూడా అక్కడే ఉండడం……..తదితర కారణాలతో ఒత్తిడి ఎక్కువై తొక్కిసలాట జరిగిందని చెప్తున్నారు. బాగుంది……..చాలా బాగుంది. చంద్రబాబుకు అస్సలు సంబంధం లేదనే అనుకుందాం. కానీ ఆ అతి ప్రచారం చేసింది ఎవరు?

అప్పటి మీడియా కథనాలు చూస్తే కనుక ఈనాడు, ఆంధ్రజ్యోతి…….ఇతర టిడిపి మీడియా సంస్థలే ఆ అతి ప్రచారం చేశాయి. ఇక చంద్రబాబు ప్రభుత్వం కూడా ఓ స్థాయిలో ప్రచారం చేసింది. ఆ రకంగా చూసినా కూడా మూడు పదుల సంఖ్యలో భక్తుల మరణాలకు కారణమైన పాపానికి చంద్రబాబునో, రామోజీరావునో, రాధాకృష్ణనో దోషిగా చూపించాలి. మరి అసలు దోషి ఎవరు? పాపం ఎవరిది? నేరస్థుడు ఎవరు? ఆ నేరస్థుడికి శిక్ష ఎప్పుడు పడుతుంది? ఇలాంటి విషయాలకు సమాధానాలు ఏమీ లేకుండా తూతూ మంత్రంగా ఒక కమిషన్ పేరుతో కాలయాపన చేసి ఇప్పుడు తీరిగ్గా చంద్రబాబుకు భక్తుల ప్రాణాలు పోవడానికి సంబంధం లేదు. రాజకీయ లబ్ది కోసం చంద్రబాబుపై బురదజల్లారు లాంటి టిడిపి నేతల మాటలు వల్లెవేస్తే సరిపోతుందా? ఈ కమిటీ సభ్యులు కనీసం బోయపాటిని విచారించారా? బోయపాటి శ్రీను సినిమాలు డైరెక్షన్ చేసేటప్పటి స్టైల్‌లోనే చేతిలో మైక్ పట్టుకుని అక్కడ ఎందుకు ఉన్నాడు? ఏం షూటింగ్ చేస్తున్నాడు లాంటి విషయాలపై వివరణ తెలుసుకున్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రజల తెలివితేటలపై ఎంత అథమస్థాయి అభిప్రాయం ఉంటే ఈ స్థాయిలో ‘రాజకీయాలు’ చేస్తారో కదా ఈ పచ్చ జనాలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -