Friday, May 17, 2024
- Advertisement -

పార్టీలో నేత‌ల‌కు అంతుచిక్క‌ని జ‌గ‌న్ వ్యూహాత్మ‌క మౌనం…

- Advertisement -

ఎన్నిక‌ల ఫ‌లితాలు రాక‌ముందె వైసీపీ, టీడీపీ నేత‌లు విజ‌యంపై ధీమాగా ఉన్నారు. సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌డానికి జ‌గ‌న్‌, చంద్ర‌బాబులు ఇద్ద‌రు ముహూర్తం పెట్టుకున్నార‌నె వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. పోలింగ్ ముగిసిన వెంట‌నె హ‌డావుడి చేసిన జ‌గ‌న్ భారీ మెజార్టీతో గెలుస్తానన్నామ‌ని ధీమా వ్య‌క్తం చేసిన జ‌గ‌న్ ఆ త‌ర్వాత ఎలాంటి ప్ర‌క‌ట‌ణా చేయ‌లేదు.

టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో పాటు మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి విజ‌యం మాదేన‌ని ఢంకా మోగిస్తున్నారు. టీడీపీ నేతలు విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న కూడా జగన్ మాత్రం అసలు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. దీంతో జగన్ మౌనం వెనుక ఇప్పుడు వైసీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. అధికార పార్టీ విజయంపై ధీమా వ్యక్తం చేస్తుంటే… జగన్ ఎందుకు కనీసం నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని గుసగుసలాడుకుంటున్నారు. జ‌గ‌న్ మౌనం ఎవ‌రికీ అంతుప‌ట్ట‌డంలేదు.

పార్టీలో జ‌గ‌న్ వ్యూహాత్మ‌క మౌనంపై పార్టీలో గుస‌గ‌సులాడుకుంటున్నారు.కనీసం మనల్ని పిలిచి ఫలితాలపై సమీక్షలు సమావేశాలు కూడా పెట్టడం లేదేంటి ? అన్న ఆందోళనలో పడిపోతున్నారు వైసీపీ నేతలు. కొందరు మాత్రం జగన్ మౌనం …రాజకీయంగా వ్యూహ్మతకంలో భాగమేనని భావిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో విజయం వైసీపీదేనని అన్ని సర్వేలు తేల్చాయి.దీంతో ఇలాంటి సమయంలో సైలెంట్‌గా ఉంటేనే మంచిద‌నే భావ‌న‌లోనె జ‌గ‌న్ ఉన్నార‌ని అంటున్నారు. 2014లో ఎదుర‌యిన అనుభ‌వాన్ని దృష్టిలో పెట్టుకొనె జ‌గ‌న్ మౌనంగా ఉన్నార‌ని భావిస్తున్నారు. ఏది ఏమైనా జ‌గ‌న్ మౌనం వెనుక అంత‌ర్యం ఎవ‌రికి అంతుప‌ట్ట‌డంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -