భార్య మీద అనుమానం తో విడాకులు ఇవ్వడమో, టార్చర్ పెట్టడమో లేక చంపేయడమో చేస్తున్న భర్త ల వార్తలు చూస్తున్న మనకి ఇదొక కొత్త ఒరవడి అని చెప్పాలి. దంపతులిద్దరూ ఒకరినొకరు అపార్థం చేసుకుని విడాకులు తీసుకున్న సందర్భాలకు కూడా మన దేశంలో అనేకం .
కానీ గురువు చెప్పాడని ఓ భార్య తన భర్తను లైంగిక సంబంధానికి దూరం పెట్టిన ఘటనను ఎక్కడైనా చూశారా? ముంబై లో ఒక మహాతల్లి ఇదే పని చేసింది. అవగాహన లోపం తో ఒక స్వామీజీ తన భర్త కి దూరంగా ఉండమని చెప్పాడు అంటూ కాపురం చెయ్యడం మానేసింది. అతను సలహా ఇవ్వడం తో భర్త ను దూరంగా పెడుతూ పిల్లలు కూడా ఒద్దు నాకు అనేసింది. ఈ విషయం మీద భర్త కోర్టుకు కూడా ఎక్కాడు.
అతడి సలహా వల్లే ఆమె తనను దూరంగా ఉంచుతుందని సదరు భర్త పిటిషన్‌లో పేర్కొన్నాడు. పెళ్ళైన మొదటి రోజు రాత్రి ప్యాకెట్ ల కొద్దీ కొండొం లు తెచ్చింది అని తరవాత తనకి ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు అని కోర్ట్ లో వాపోయాడు. తాను ఆఫీసులో ఉండగా పదే పదే ఫోన్లు చేస్తూ పనికి ఆటంకం కలిగిస్తోందని ఆరోపించాడు.
ఈ ఆరోపణలు ఇంతటితో ఆగలేదు, భార్య తన మెయిల్ అకౌంట్‌ను హ్యాక్ చేసిందనీ, తనపై వ్యతిరేకత కలిగించేలా తన మిత్రులందరికీ మెయిల్స్ పెడుతోంది అని గగ్గోలు పెట్టాడు .