Friday, May 9, 2025
- Advertisement -

బాబు పై మోది కి నమ్మకం పోతోందా..?

- Advertisement -
YS Jagan in..? Chandrababu naidu out..?

ఏపీలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. దీనికంత‌టికి ఒకే ఒక్క‌కార‌నం వైసీపీ అధినేత …ప్ర‌ధాని మోదీతో భేటీ కావ‌డ‌మే.అయితే దీనిపై ఇప్ప‌టికే ఉహాగానాలు మొద‌ల‌య్యాయి. భాజాపా నేత‌లు మాట్లాడిన వ్యాఖ్య‌లు ఇందుకు బ‌లాన్ని ఇస్తున్నాయి.ఈదెబ్బ‌తో చిర‌కాల మిత్ర‌ప‌క్షాలైన టీడీపీ-భాజాపా మ‌ధ్య బంధం ఇక ఎక్కు వ‌కాలం కొన‌సాగ‌డం క‌నిపిండంలేద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

ఏపీలో బీజేపీ అనుసరించబోయే వ్యూహానికి ఇది సంకేతం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మోడీ, జగన్ ల భేటీతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారుతాయనే సంకేతాలను ఇచ్చినట్లుందని పరిశీలకులు అంటున్నారు. మోడీతో భేటీ తర్వాత జగన్ మాట్లాడిన తీరు ఆ విషయాన్ని వెల్లడిస్తోందని చెబుతున్నారు. 2014 ఎన్నికల తర్వాత పరిణామాలను నిశితంగా గమనిస్తే చంద్రబాబుకు నరేంద్రమోదీ ప్రాధాన్యత బాగా తగ్గించినట్టుగానే కనిపిస్తుంది.
మోదీ-జ‌గ‌న్ భేటీపై టీడీపీ చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు భాజాపా ఘాటుగా కౌంట‌ర్ అటాక్ చేస్తోంది.అధిస్టానంతోపాటు ..రాష్ట్ర‌నాయ‌వ‌త్వం జ‌గ‌న్‌కు పుల్ స‌పోర్టుగా మాట్లాడుత‌న్నారు.పైకి మిత్ర‌ప‌క్షం అని చెప్పుకోడం త‌ప్ప ఎప్పుడూ ఇరు పార్టీల నేత‌ల మ‌ధ్య స‌క్య‌త‌లేద‌నే చెప్పాలి. ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌త‌రేక విధానాల‌పై భాజాపా నేత‌లు బ‌హిరంగంగానే విమ‌ర్శిస్తున్నారు.ఇప్ప‌టికే టీడీపీ గ్రాఫ్ ప‌డిపోడంతో వ‌చ్చె ఎన్నిక‌ల్లో టీడీపీతో క‌ల‌సి ఉంటె న‌ష్టం త‌ప్ప‌ద‌నే జ‌గ‌న్‌కు మోదీ త‌లుపులు తెరిచార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు చిక్కుకున్న తర్వాత టీడీపీ విషయంలో బీజేపీ నాయకత్వం మరింత చులకన భావనతో ఉందన్న అభిప్రాయం బలపడింది. దీనికి తోడు చంద్రబాబు కూడా కేంద్రంతో కయ్యం పెట్టుకుని లాభం కన్న కష్టమే ఎక్కువ అంటూ ప్రత్యేక హోదా లాంటి అంశాలపైనా రాజీ పడడంతో చంద్రబాబు పట్ల ప్రజలు అనుమానపు చూపు చూడాల్సిన పరిస్థితి ఏర్ప‌డింది.. వైసీపీ నేత‌ల‌ను టీడీపీలో చేర్చుకొని …వార‌ని రాజీనామ చేయ‌కుండా మంత్రి ప‌దువులు ఇచ్చి పార్టీ పిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తోంద‌ని.. భాజాపా సీనియ‌ర్ నేత పురందేశ్వ‌రిసైతం బాబు ప్ర‌భుత్వంపై కేంద్రానికి పిర్యాదు చేసింది.

{loadmodule mod_custom,Side Ad 1}

చంద్రబాబు పట్ల మోదీకి తొలి నుంచి కూడా మంచి అభిప్రాయం లేదు.కానీ కేంద్రంత్రివెంక‌య్య‌నాయుడు చొరువ‌తో రాష్ట్రంలో భాజాపా టీడీపీతో అంట‌కాగుతోంది. బాబు ప్ర‌భుత్వం ఎన్నిత‌ప్పులు చేసినా వెంక‌య్య‌నాయుడు కాపాడుతూ వ‌స్తున్నారు.అయితేవెంక‌య్య‌నాయుడు,బాబు దేశంలో లేన‌ప్పుడే జ‌గ‌న్‌కు మోదీ అపాయంట్ ఇవ్వ‌డం చూస్తె వెంక‌య్య‌నాయుడు పెత్త‌నం క‌డా ఇక సాగ‌ద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.
ఈనేపథ్యంలోనే చంద్రబాబు విషయంలో గుడ్డి విశ్వాసం సరికాదన్న భావనకు బీజేపీ నాయకత్వం వచ్చిందని భావిస్తున్నారు. పైగా ఏపీలో అవినీతి తారాస్థాయికి చేరిపోయిందని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే తేల్చిచెప్పాయి. ఒకవైపు అవినీతిరహిత భారతాన్ని నిర్మిస్తున్నామంటూనే ఏపీలో మిత్రపక్షం చేస్తున్న అవినీతిపై మాత్రం బీజేపీ నోరు విప్పడం లేదన్న విమర్శ ఉంది. ఒకవిధంగా టీడీపీ చేస్తున్న తప్పులకు బీజేపీ బాధ్యత వహించాల్సి వస్తోందన్న భావన సిసలైన ఏపీ బీజేపీ నాయకుల్లో ఉంది.
బీజేపీ టార్గెట్ గా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలపట్ల ఆ పార్టీ అధినాయకత్వం ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. పవన్ కల్యాణ్ తీరు మోడీకి కూడా రుచించడం లేదని టాక్. కాగా, పవన్ కల్యాణ్ వెనక చంద్రబాబు ఉన్నారని బీజేపీ భావిస్తోంది.అందుకే ఇక టీడీపీతో బంధం తెంచేసుకొని …వైసీపీ అధినేత జ‌గ‌న్‌తో స్నేహ హ‌స్తం అందిస్తున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -