Friday, May 9, 2025
- Advertisement -

ఉపాధ్యాయ దినోత్స‌వంలో పాల్గొన్న వైఎస్ జ‌గ‌న్‌….

- Advertisement -

భారత రత్న, భారతదేశ తొలి ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌. ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. రాధాకృష్ణన్‌ 1888లో తిరుత్తనిలో జన్మించారు. కేంద్ర ప్రభుత్వం రాధాకృష్ణన్‌ పుట్టిన రోజును 1962 నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించి గౌరవిస్తోంది.

విశాఖ‌జిల్లాలో పాద‌యాత్ర‌లో ఉన్న వైఎస్ జ‌గ‌న్ పాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్నారు. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్‌ జగన్‌, పెందుర్తి నియోజకవర్గంలోని గుల్లేపల్లిలో ఏర్పాటు చేసిన వేడుకల్లో భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంతేకాకుండా పలువురు విశ్రాంత అధ్యాపకులను వైఎస్‌ జగన్‌ సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, గుడివాడ అమరనాథ్‌తో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -