Saturday, April 27, 2024
- Advertisement -

జగన్‌ మాస్టర్ ప్లాన్.. వన్‌ షాట్‌ టూ బట్స్..

- Advertisement -

ఏపీలో పెట్టుబడులను ఆకర్షించేందుకు జగన్‌ వేసిన మాస్టర్ ప్లాన్ సక్సస్‌ అయినట్లే కన్పిస్తోంది. పెట్టుబడులు లేవు, పారిశ్రామిక వేత్తలు రావడమే లేదు, ఇలాగైతే రాష్ట్ర ప్రగతి ఏలా సాధ్యమౌతోందంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోన్న విపక్షాలకు జగన్‌ ఒక్క చర్యతో సమాధానం చెప్పినట్లే అయిందంటున్నారు పరిశీలకులు. పారిశ్రామిక రంగాల్లో భారీ దిగ్గజాలు విశాఖకు తరలిరావడం, భారీ ఎత్తున ఎంవోయూలు కుదుర్చుకోవడం ఓ పెద్ద మైలురాయిగా భావిస్తున్నారు. మరి రానున్న ఎన్నికలను ఎదుర్కొనేందుకు జగన్‌ వేసిన పకడ్భందీ స్కెచ్‌ ఫలించినట్లే భావించాలా..

వన్‌ షాట్‌ టూ బట్స్ అనేది పాత ముచ్చట. జగన్‌ లాంటి మల్టీ ట్యాలెంటెడ్‌ విషయంలో కొత్త సామెతలు రూపుదిద్దుకుంటాయని చెబితే అతిశయోక్తి కాదేమో. అందుకు విశాఖలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టెస్‌ సమిట్‌ 2023డే సాక్ష్యం. ఏపీలో రోడ్లు సరిగ్గాలేవు, కోత్త పరిశ్రమలేవీ రావడం లేవు, ఖజానాకు బోక్కలు పడ్డాయ్, ఉద్యోగులకు వేతనం ఇవ్వాలనా.. ఖానా కష్టంగా మారింది. అప్పులు చేయకుండా ఉండలేని పరిస్థితి. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఇలా ఉంటే ప్రజల ఆశలు ఎలా నెరవేరుస్తోంది. ప్రభుత్వం మీద నమ్మకం ఎలా కుదురుతోంది. కనీస వసతులు కూడా సమకూర్చకపోతే.. పెట్టుబడు దారులు ఎలా వస్తారు. ఇలాంటి పదునైన విమర్శలతో రాష్ట్రం దివాలా తీస్తోందని చడుగుడు ఆడుతోన్న విపక్షాలకు జగన్‌ పావులు కదిపి అందరి నోర్లు మూయించారన్న వ్యాఖ్యలు వినిస్తోన్నాయి. విశాఖలో జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సులో అంఛనాలకు మించి ప్రపోజల్స్‌ రావడం జగన్‌ శిబిరంలో కొత్త జోష్ నింపిందన్న వ్యాఖ్యలు వినిస్తోన్నాయి.

రెండు రోజల పాటు జరిగే ఈ సదస్సు ద్వారా 2 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకాంక్షించేందుకు తొలుత ప్రభుత్వం అంచనా వేసింది. పారిశ్రామిక వేత్తల నుంచి కనీస పెట్టుబడులే అంచనా వేసిన ఏపీ సర్కార్.. ఈ సమ్మిట్‌లో వారి అనౌన్స్ మెంట్లను చూసే సరికి అశ్చర్య పోవడం ప్రభుత్వాధి నేతల వంతైంది. 13 లక్షల కోట్ల వరకు భారీ ప్రపోజల్స్ వచ్చాయని సీఎం జగన్‌ ప్రకటించడం ఏపీలో పెట్టుబడులకు, పరిశ్రమలకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పకనే చెప్పినట్లైంది.

-Anjanreddy kodathala

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -