Saturday, April 27, 2024
- Advertisement -

ఆసీస్‌తో టీ20 సిరీస్..ఇరు జట్ల బలాబలాలివే!

- Advertisement -

వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఓటమి తర్వాత తొలి సిరీస్‌ను ఆసీస్‌తోనే ఆడనుంది భారత్. ఐదు టీ 20ల సిరీస్‌లో భాగంగా ఇవాళ విశాఖపట్నం వేదికగా రాత్రి 7 గంటలకు తొలి టీ20 జరగనుంది. ఇక భారత్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా ఆసీస్‌కు మథ్యూ కెప్టెన్‌గా ఉన్నారు. ఇక భారత్‌..ఇషాన్ కిషన్,ప్రసిద్ కృష్ణ వరల్డ్ కప్‌ టీమ్‌లోని ఇద్దరు తప్ప మిగితా అందరూ కొత్త స్వ్కాడే. శ్రేయాస్ అయ్యర్ చివరి రెండు టీ20లకు అందుబాటులో ఉండనున్నాడు. వీవీఎస్ లక్ష్మణ్ ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

ఇక ఆసీస్‌ సైతం సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. మాథ్యూ వేడ్ కెప్టెన్సీలో బరిలో దిగనుంది. ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ స్వదేశానికి వెళ్లగా అసిస్టెంట్ కోచ్ ఆండ్రీ బోరోవెక్ తొలిసారిగా కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు.

వచ్చే ప్రపంచకప్‌కు ముందు వికెట్‌కీపర్‌గా సత్తాచాటేందుకు ఇషాన్ కిషన్‌కు ఇది సువర్ణ అవకాశం. ఇప్పటివరకు 29 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. జితేష్ శర్మ రెండవ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరూ జట్టులో ఉండటంతో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా ఉండటంతో త్రిముఖ పోరు నెలకొంది. ఇక టీ20ల్లో ఇషాన్ కేవలం రెండుసార్లు మాత్రమే ఓపెనర్‌గా వచ్చాడు.

ఇరు జట్లు అంచనా:

భారత్:
ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్,సూర్యకుమార్ యాదవ్,తిలక్ వర్మ,శివమ్ దుబే,రింకూ సింగ్, అక్షర్ పటేల్/వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్,అర్షదీప్ సింగ్,ప్రసిద్ కృష్ణా/ఆవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్.

ఆసీస్:
స్టీవ్ స్మిత్,మాథ్యూ షార్ట్,ఆరోన్ హార్డి, జోష్ ఇంగ్లీస్, స్టాయినిస్,టిమ్ హెడ్, మాథ్యూ వేడ్,సీన్ అబాట్, నాథన్ ఎలిస్, జాసన్ బెహ్రిన్‌డొర్ఫ్,తన్వీర్ సంగా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -