Sunday, June 2, 2024
- Advertisement -

ఆ సాయంత్రం సరదాగా గడిపిన జగన్..!

- Advertisement -

ఎప్పుడు బిజీ బిజీగా ఉండే వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంద్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ మెంబర్స్‌తో సరదాగా గడిపారు.

ఎప్పుడూ టైట్ సెక్యూరిటీతో ఉండే జగన్ ఆ రోజు మాత్రం సింపుల్‌గానే ఎటువంటి హడావిడి లేకుండా 5 స్టార్ హోటల్‌కి ఫ్యామిలి మెంబర్స్‌తో డిన్నర్‌కి వెళ్ళారట. శుక్రవారం సాయంత్రం జగన్ మోహన్‌ రెడ్డి అరేంజ్ చేసిన విందుకు భార్య వైయస్‌ భారతి, ఇద్దరు డాటర్స్ హర్ష, వర్ష, అమ్మ వైయస్‌ విజయమ్మ, చెల్లెలు షర్మిళ, బావ బ్రదర్ అనిల్ కుమార్ హాజరయ్యారు. వీరందరూ ఆ రోజు సాయంత్రం చాలా సంతోషంగా గడిపారట. 

ఈ స్పెషల్‌ విందు ఏర్పాటు చేసింది జగన్ మోహన్ రెడ్డే అని సమాచారం. మరి ఈ ఫ్యామిలీ పార్టీ వెనుక ఏదైనా స్పెషల్ అకేషన్ ఉందేమో తెలియాల్సి ఉంది. ఎప్పుడూ సమయం కుదరని జగన్‌, చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో గడుపుతున్నందున అందరూ బాగా ఎంజాయ్‌ చేశారని సమాచారం. ఈ మద్యనే జెరూసలెంకు ఫ్యామిలీతో కలిసి వెళ్ళిన జగన్, మళ్ళీ ఫ్యామిలీ అవుటింగ్‌కి వెళ్ళి ఏ రాజకీయ ఒత్తిడులు లేకుండా కొన్ని గంటలు సరదాగా గడపటం విశేషం.. జెరూసలెం టూర్ అందరికి తెలిసినా.. నిన్న శుక్రవారం జరిగిన డిన్నర్ పార్టీ మాత్రం ఎవ్వరికి తెలియకుండా గోప్యంగా ఉంచారు.     

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -