Friday, May 9, 2025
- Advertisement -

రిలే నిరాహార దీక్షలు వాయిదా వేసిన షర్మిల

- Advertisement -

దేశంలో కరోనా పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దేశంలో ఒక్కరోజే మూడు లక్షల వరకు కరోనా కేసులు నమోదు అయ్యాయంటే సెకండ్ వేవ్ తీవ్రత ఎంత ఘోరంగ ఉందో తెలుస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ, లాక్ డౌన్ కూడా విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ఉద్యోగ సాధన రిలే నిరాహార దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ మేరకు ఆమె కార్యాలయం తెలిపింది. ఈ మద్య ఎన్నికల నేపథ్యంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. అందుకే కార్యకర్తలు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. ఇప్పటికే ఆమె 72 గంటల నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే.

అయితే తెలంగాణలో గత ఆరేళ్ల కాలంలో ఉద్యోగ నియామకాల విషయంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దీంతో యువకులు ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని షర్మిల స్పష్టం చేశారు.

గుడ్ న్యూస్ : వారంలోగా 4 లక్షల రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు!

పశ్చిమ బెంగాల్‌లో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం!

సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు కరోనాతో మృతి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -