Friday, May 3, 2024
- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం!

- Advertisement -

బెంగాల్​ లో ఆరో విడత పోలింగ్​ ప్రారంభమైంది. పోలింగ్ బూత్ ​ల​ వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఈ ఉదయం 43 నియోజకవర్గాల్లో ఆరో దశ పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో 303 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో నాలుగు జిల్లాల్లోని 14,480 పోలింగ్ స్టేషన్ల లో ఓటింగ్ జరుగుతుంది. కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బయపడుతున్నట్టు సమాచారం.

నాలుగు, ఐదో దశ ఎన్నికల సందర్భంగా చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఈసీ అధికారులు తెలిపారు. సుమారు 1071 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. ఆరో దశ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

నేటి పంచాంగం, గురువారం (22-04-2021)

నటి చార్మి సంచలన నిర్ణయం..

చెన్నై హ్యాట్రిక్ విజయం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -