Thursday, April 18, 2024
- Advertisement -

గుడ్ న్యూస్ : వారంలోగా 4 లక్షల రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు!

- Advertisement -

గత కొన్ని రోజులుగా తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. తెలంగాణలో 24 గంటల్లో 6,542 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఒక్క‌రోజులో కరోనాతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 2,887 మంది కోలుకున్నారు. అయితే తెలంగాణలో ఆక్సీజన్, వ్యాక్సిన్ కొరత ఏర్పడిందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ ట్రీట్మెంట్లో రెమిడిసివిర్ వ్యాక్సిన్ విరివిగా వినియోగిస్తున్నారు.

వైరస్ సోకి శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తుతున్న వారికి వైద్యులు ఆక్సిజన్‌తో పాటు రెమిడెసివిర్ ఇంజక్షన్‌లను ఇస్తున్నారు. ఫలితంగా వైరస్ లోడ్ తగ్గి రోగులు త్వరగా కోలుకుంటున్నట్టు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ ఓ శుభవార్త చెప్పారు. తాజాగా తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రులకు వారంలోగా 4 లక్షలకు పైగా రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు అందేలా చూస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

రెమిడిసివిర్ ఉత్పత్తి చేసే ఫార్మా కంపెనీలతో ఈరోజు చర్చలు జరిపామని ఆయన తెలిపారు. నాలుగు లక్షలకు పైగా రెమిడిసివిర్ వారం రోజుల్లోగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు చేరుతుందని చెప్పారు. ఉత్పత్తి తగ్గడం.. చాలాచోట్ల ఇంజక్షన్లు లభించకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఉత్పత్తి పెంచాలని తయారీ సంస్థలతో మంత్రి కేటీఆర్‌ ఇవాళ చర్చలు జరిపారు.

కరోనా విషాదం.. ఆక్సిజన్ ట్యాంక్ లీకై 22 మంది మృతి!

తెలంగాణలో కరోనా డేంజర్ వేవ్.. ఒక్కరోజే 20 మంది మృతి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -