వైసీపీ కి వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా నిర్వహించిన వైసీపీ ప్లీనరీ సమావేశాలలో ఆమె ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. గత కొంత కాలంగా అన్న చెల్లెళ్ళు అయిన వైఎస్ జగన్ , షర్మిల మద్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఆ మద్య వైఎస్ షర్మిల కూడా ఓ ఇంటర్యూ లో పరోక్షంగా విభేదాలు వున్నాయనే విషయాన్ని వెల్లడించారు. ఇక తాజాగా తండ్రి జయంతి సందర్భంగా ఇడుపులపాయ చేరుకున్న అన్న చెల్లెళ్ళు ఘాట్ వద్ద కూడా ఎడమొఖం పెదమొఖం గానే ఉండడంతో జగన్, షర్మిల మద్య విభేదాలు ఉన్నాయనే విషయం మరో సారి బయటపడింది.
అయితే అన్న చెల్లెళ్ల మద్య ఉన్న విభేదాలు తల్లి విజయమ్మ కు ఏమాత్రం నచ్చడంలేదని.. ఆ విషయంలో జగన్ వైఖరి పట్ల విజయమ్మ అసహనంగా ఉందని కూడా గత కొంత కాలంగా మీడియా కొడై కుస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ నిర్వహించిన ప్లీనరీ సమావేశాలలో విజయమ్మ అనూహ్యంగా వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవి కి రాజీనామా చెయ్యడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేవలం గౌరవ అధ్యక్ష పదవికి మాత్రమే కాకుండా పూర్తిగా వైసీపీ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించడం ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశం అవుతోంది.
అంతే కాకుండా షర్మిల కోసమే వైసీపీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి వారి కుటుంబంలో విబేదలు ఉన్నాయనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. గత కొంత కాలంగా జగన్ వైఖరి పట్ల విజయమ్మ చాలా అసంతృప్తిగా ఉన్నారని.. అందుకే ఆమె తన కూతురు వైఎస్ షర్మిల తోనే ఉండేనుకు ఇష్టపడుతున్నారనే వాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి వైఎస్ విజయమ్మ వైసీపీ కి రాజీనామా చెయ్యడం.. ఆ పార్టీ పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి తల్లి విజయమ్మ రాజీనామా పట్ల సిఎం జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read
పిల్లల విషయంలో.. జగన్ తప్పుచేస్తున్నారా ?
బాబు, జగన్ లకు అగ్ని పరీక్ష.. మరి పవన్ సంగతేంటి ?
ఆసక్తి రేపుతోన్న జగన్ ప్లాన్ ?