Friday, April 26, 2024
- Advertisement -

ఆసక్తి రేపుతోన్న జగన్ ప్లాన్ ?

- Advertisement -

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో అధికారం చేపట్టి మూడేళ్లు పూర్తయింది. ఈ మూడేళ్లలో జగన్ పరిపాలనపై ప్రజల్లో కొంత సానుకూలత, కొంత వ్యతిరేకత రెండు ఉన్నాయి. 2019 లో జగన్ ప్రమాణ స్వీకారం రోజున ప్రజలచే మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అని చెప్పుకొచ్చారు. అయితే ఈ మూడేళ్ళ పరిపాలనలో మంచి ముఖ్యమంత్రి అనిపించుకునే విషయం పక్కనపెడితే .. మొత్తంగా జగన్ పరిపాలనపైనే పెదవి విరుస్తున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో మళ్ళీ అధికారం చేజిక్కించుకోవాలన్న, ప్రజాళ్లో ఉన్న వ్యతిరేకతను దాటుకొని సానుకూలత ఏర్పడేలా వ్యూహాలు రచించాలి. ఈ నేపథ్యంలో సి‌ఎం జగన్ రాబోయే ఎన్నికలకు సిద్దమయ్యేందుకు పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నారు.

వైసీపీ అధికరంలోకి వచ్చిన తరువాత నిర్వహిస్తున్న తొలి ప్లీనరీ సమావేశాలు కావడంతో ఈ సమావేశాలలో వైఎస్ జగన్ ఎలాంటి తీర్మానలకు ఆమోదం ఇస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. 2017 లో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే ఈ సారి కూడా జరగనుంది. మరొక ఆసక్తికర విషయం ఏమిటంటంటే ఈ ప్లీనరీ సమావేశాలకు వైఎస్ విజయమ్మ కూడా హాజరు అవ్వబోతున్నట్లు వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో తిరిగి అధికారం చేపట్టడమే ప్రధాన ఎజెండా గా ఈ ప్లీనరీ సమావేశాలను వైఎస్ జగన్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ప్లీనరీ సమావేశాలలో సి‌ఎం జగన్ ముందస్తు ఎన్నికల విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా పార్టీ పరంగా రాబోయే ఎన్నికలకు సిద్దమయ్యేందుకు రూట్ మ్యాప్ కూడా ప్రకటించే అవకాశం ఉంది.

వైఎస్ జగన్ వేసిన మరొక మాస్టర్ ప్లాన్ ఏమిటంటే వైసీపీ కి శాశ్వత కాలం అద్యక్షుడిగా కొనసాగేందుకు పార్టీ బైలాస్ లో కూడా మార్పులు చెయ్యనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా జరిగింది. అంతే కాకుండా పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవి కొనసాగింపుపై కూడా ఈ ప్లీనరీ సమావేశాలలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 2017 లో నిర్వహించిన ప్లీనరీ సమావేశాలలో జగన్ పాదయాత్రతో పాటు వైసీపీ ప్రధానంగా హైలెట్ చేసిన నవరత్నాలను కూడా ప్రకటించారు. మరి ఈ ప్లీనరీ సమావేశాలలో వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.. ఏది ఏమైనప్పటికి రాబోయే ఎన్నికలే లక్ష్యంగా వైఎస్ జగన్ వేసిన ఈ ప్లీనరీ ప్లాన్ ఎంతవరకు ఫలితాలను ఇస్తుందో చూడాలి.

Also Read

అంబటి.. మాట తీరు మారెనా ?

మోడి విషయంలో కే‌సి‌ఆర్ తప్పు చేశాడా ?

చిరు పవన్ మద్య చిచ్చు పెట్టిన మోడి రాక ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -