Friday, April 26, 2024
- Advertisement -

పిల్లల విషయంలో.. జగన్ తప్పుచేస్తున్నారా ?

- Advertisement -

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికరంలోకి వచ్చిన తరువాత ఆయా సంక్షేమ పథకాలతో, సరికొత్త నిర్ణయాలతో ముందుకు పోతున్నప్పటికి, కొన్ని సార్లు ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడేలా చేస్తున్నాయి. ముఖ్యంగా సంక్షేమ పథకాలకు పెట్టె డబ్బును, తిరిగి రాబట్టుకునేందుకు నిత్యవసర ధరలు పెంచడం, ఉచితల పేరుతో డబ్బులు వృదా చేస్తూ ప్రజలపైనే భారం వేయడం వంటి ఎన్నో చర్యలు ప్రజల్లో జగన్ పరిపాలనాపై వ్యతిరేక ప్రభావం చూపుతున్నాయి. ఇక పిల్లలపై ఎప్పుడు అమితమైన ప్రేమ కనబరిచే సి‌ఎం జగన్.. పిల్లలకోసం.. స్కూల్స్ అభివృద్ది కోసం “నాడు నేడు “, జగనన్న విద్యా దీవెన పేరుతో స్కూల్ కిట్లు వంటివి పిల్లలకు పంచడం చేస్తుస్తున్నారు.

ఇవి బాగున్నాయి అనుకునే లోపే, మళ్ళీ తల తోక లేని నిర్ణయం తీసుకొని పిల్లలను, తల్లిదండ్రులను సందిగ్డంలో పడేశారు. ఇటీవల ఏపీలో స్కూల్స్ పునఃప్రారంభం అయ్యాయి. అయితే ఈ సారి 3,4,5, తరగతులను అప్పర్ ప్రైమరీ స్కూల్స్ లోనూ, హైస్కూల్స్ లోనూ కలపడంతో తల్లిదండ్రులు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఎందుకంటే హైస్కూల్స్ ఊరికి దూరంలో ఉంటాయి. కనీసం రెండు కిలోమీటర్ల దూరంలోనైనా ఉంటాయి. ఈ నేపథ్యంలో 3,4, వంటి తరగతుల పిల్లలు.. చిన్న పిల్లలు కావడంతో రెండు కిలోమీటర్ల మేర నడిచి స్కూల్స్ కు పోవలసి ఉంటుంది. ఈ సందర్భంలో రోడ్లపై వాహనాల ద్వారా పిల్లలకు ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు. దాంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఊర్లో ఇంటిదగ్గర ఉండే పిల్లల బడులను తీసి హైస్కూల్స్ లో కలపడం ఏంటని వాపోతున్నారు. సాధారణంగా విద్యావిధానాలు చెబుతున్నా దాని ప్రకారం పాటశాలలు ఒక కిలోమీటర్ పరిధిలోనే ఉండాలి, కానీ ప్రభుత్వ నిర్ణయంతో పాటశాలలు ఏకంగా మూడు కిలోమీటర్ల మేర తరలిపోయాయి. జాతీయ విద్యావిధానం, స్కూల్స్ రేషనలైజేషన్ పేరుతో 3,4,5 తరగతులను హైస్కూల్స్ లో కలపడం చిన్న పిల్లలను ఇబ్బంది పెట్టడమేనంటూ ప్రభుత్వ విధానంపై తల్లిదండ్రులు మండి పడుతున్నారు. అంతా అర్జెంట్ గా 3,4,5, తరగతులను హైస్కూల్స్ లో కలపల్సిన అవసరం ఎమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఒక విధంగా ఆలోచిస్తే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చిన్న పిల్లనను ఇబ్బంది పెట్టడమేనంటూ విశ్లేషకులు సైతం చెబుతున్నారు.

Also Read

భారత్ అంటే రష్యాకు ఎంత ప్రేమో !

మోడి విషయంలో కే‌సి‌ఆర్ తప్పు చేశాడా ?

ఆసక్తి రేపుతోన్న జగన్ ప్లాన్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -