Friday, April 19, 2024
- Advertisement -

బాబు, జగన్ లకు అగ్ని పరీక్ష.. మరి పవన్ సంగతేంటి ?

- Advertisement -

ప్రస్తుతం ఏపీ లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, ఎప్పటికప్పుడు ఆసక్తి ప్రజల్లో ఆసక్తి కలిగిస్తూనే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో జరగనున్న త్రిముక పోరులో చంద్రబాబు, జగన్, పవన్ ఎవరికి వారు సరికొత్త వ్యూహాలతో ఇప్పటినుంచే కథం తొక్కుతున్నారు. అయితే వచ్చే ఎన్నికలు చంద్రబాబు, జగన్ లకు అత్యంత కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు రాజకీయ జీవితం అంతా కూడా రాబోయే సార్వత్రిక ఎన్నికలపైనే ఆధారపడింది. ఇప్పటికే చంద్రబాబు వయసు 72 సంవత్సరాలు.. రాబోయే 2024 ఎన్నికల నాటికి ఆయన వయసు 74 సంవత్సరాలకు చేరుకుంటుంది. దాంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే సరాసరి.. లేకపోతే మళ్ళీ 2029 ఎన్నికల వరకు వెయిట్ చెయ్యక తప్పదు..

అప్పటికి ఆయన వయసు 79 సంవత్సరాలకు వచ్చేస్తుంది. దాంతో ఆయన రాజకీయ జీవితనికి విరామం చెప్పాల్సిన పరిస్థితి. ఒకవేళ చంద్రబాబు రాజకీయాలకు విరామం తీసుకొని, పార్టీ పగ్గాలు తనయుడు లోకేశ్ కు అప్పగిస్తే.. లోకేష్ నాయకత్వంపై తెలుగు తమ్ముళ్లలోనే ఎన్నో అనుమానాలు ఉన్నాయి. దాంతో టీడీపీ తెలంగాణ మాదిరి గానే ఏపీలో కూడా కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదు. దాంతో రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ తప్పక అధికరంలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు కూడా వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రణాళికలు వేస్తున్నారు. ఇక సి‌ఎం జగన్ విషయానికొస్తే 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విజయాన్ని నమోదు చేసి అధికారం చేపట్టారు. ఈ విజయాన్ని మరో పదేళ్ళు కొనసాగిస్తానంటూ జగన్ చాలాసార్లు చెప్పుకోస్తూనే ఉన్నారు. కానీ జగన్ ప్రస్తుత పరిపాలనపై ప్రజలు కాస్త సందిగ్ధంలోనే ఉన్నారు.

జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత నిత్యవసర ధరల పెరుగుదల, టాక్స్ లు పెరగడం, అవినీతి ఆరోపణలు, నియంత పరిపాలన, వైసీపీ నేతల అక్రమ వ్యవహారాలు.. ఇవన్నీ కూడా ప్రజల్లో జగన్ పరిపాలనపై వ్యతిరేక ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ చెప్పినట్లుగా మరో పదేళ్ళు అధికారంలో ఉండాలంటే.. ఈ వ్యతిరేకతలన్నీ దాటుకొని వచ్చే ఎన్నికల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక పవన్ విషయానికొస్తే.. చంద్రబాబు, జగన్ లతో పోలిస్తే పవన్ పై ఒత్తిడి కాస్త తక్కువగానే ఉంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, జగన్ పై ఉన్న వ్యతిరేకత పవన్ కు కలిసొచ్చే అవకాశం ఉంది. దాంతో 2024 ఎన్నికల్లో జనసేన 10 సీట్లు కైవసం చేసుకున్నా, పార్టీ మరింత బలపడుతుంది. అదే కాకుండా పవన్ కు కూడా అధికారం లోకి రావలనే ఆశ మొదటి నుండి లేనట్లే కనిపిస్తోంది. ఆయన వ్యవహార శైలి కూడా తగిలితే లక్ష రూపాయల లాటరీ.. పోతే పది రూపాయలు అన్న విధానం లోనే ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలిచిన, ఓడిన పవన్ కు పెద్దగా తేడా ఏమి ఉండదు. కాబట్టి ముఖ్యంగా రాబోయే ఎన్నికలు చంద్రబాబు, జగన్ లకు అగ్నిపరీక్ష అనే చెప్పాలి.

Also Read

ఆసక్తి రేపుతోన్న జగన్ ప్లాన్ ?

బీజేపీ జోష్ కొనసాగేనా ?

కే‌సి‌ఆర్, పికే వ్యూహం.. ఫలించేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -