Saturday, May 18, 2024
- Advertisement -

వైసీపీ ఎమ్మెల్యేకు పవన్ అంటే పడిచచ్చే అభిమానమట

- Advertisement -
prabhas like baahubali role

రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రానా.. తమ అభిమాన నటుడిపై అభిమానం ఏ మాత్రం తగ్గదు.. కొందరు రాజకీయ నాయకులకు. బాలకృష్ణకు వైఎస్ జగన్ పెద్ద అభిమాని. రాజకీయకంగా శత్రువు అయినా.. సినిమాల పరంగా మాత్రం బాలయ్యకు పెద్ద ఫ్యాన్. ఈ మధ్య తెలుగుదేశం ఎమ్మెల్యేలందర్లోకి బాలయ్య ది బెస్ట్ అంటూ అసెంబ్లీ లాబీలో జగన్ మాట్లాడటం అందరిలో ఆసక్తి కలిగించిన విషయం తెలిసిందే.

ఐతే వైకాపాకే చెందిన మరో ఎమ్మెల్యే అయితే బాహాటంగానే తనకున్న సినీ అభిమానాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు.. నెల్లూరు సిటీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అనిల్ కుమార్ యాదవ్. ఈ ఎమ్మెల్యేకు పవర్ స్టార్ అంటే పిచ్చి అభిమానమట. తాను ఎక్కువగా పవన్ కళ్యాణ్‌ను సినిమాలను చూసేవాడినని.. పవన్ కళ్యాన్ కి అభిమానినని అనిల్ కుమార్ చెబుతున్నాడు.

రెండు దశాబ్దాల కిందట పవన్ హీరోగా వచ్చినప్పటి నుంచి ఆయన అభిమానిగా మారిపోయానని.. ఎప్పుడు పవన్ మూవీస్ ని మొదటి రోజే మొదటి షో చూసేవాడినని.. ఇప్పటికి పవన్ సినిమాల్ని మిస్ కానని అంటున్నాడు అనిల్. పవన్ కెరీర్ లో ప్లాప్ గా నిలిచిన జానీ సినిమాని.. తాను తొమ్మిదిసార్లు చూసానని అని తెలిపాడు. సినిమా ఎలా ఉన్నది అనేది ముఖ్యం కాదని.. తెర మీద పవన్ ను చూడటమే సంతోషం కలిగించేదని.. అందుకే పవన్ ప్రతి సినిమాను మళ్లీ మళ్లీ చూసేవాడినని అనిల్ అన్నాడు. పవన్ రాజకీయ పార్టీ పెట్టిన దగ్గర నుంచి వైసీపీ పై చాలా విమర్శలు చేసిన.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇంతటి అభిమానమ్ చూపటం విశేషమే.

Related

  1. చంద్ర‌బాబుకు ముద్ర‌గ‌డ డెడ్ లైన్
  2. చిత్తూరు జిల్లాలో టీడీపీకీ మ‌రోషాక్‌… వైసీపీ వైపు ఎంపీ శివ‌ప్ర‌సాద్ చూపు
  3. వంగవీటి పై కేసు.. మళ్లీ మొదలు అయిన రచ్చ.. ఎందుకు ఈ వివాదం..?
  4. కుల‌భ‌కూష‌న్ జాదవ్ ఆరిపై అప్పీలు చేసుకోవ‌చ్చ‌న్న పాక్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -