Friday, May 17, 2024
- Advertisement -

అఖిల‌ప్రియ‌కు బాబు షాక్ ఇవ్వ‌బోతున్నారు..

- Advertisement -

అతి చిన్న వియ‌సులోనె అక‌ఖిల‌ప్రియ బాబు మంత్రి వ‌ర్గంలో స్థానం సంపాదించి రికార్డు సృష్టించారు. ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా అఖిల బాధ్య‌త‌లు స్వీక‌రించారు. దాదాపు సంవ‌త్స‌రం దాటింది మంత్రిగా బాధ్య‌తులు స్వీక‌రించి. ఊరంద‌రిది ఒక దారి అయితె …ఉల్లిగ‌డ్డ‌ది ఒక‌దారి అయిన‌ట్లు మంత్రి వ‌ర్గంలోని మంత్రులంద‌రు ఒక‌ట‌యితె…అఖిల‌మాత్రం నారూటె స‌ప‌రేటు అంటోంది.

అఖిల‌ప్రియ ప్ర‌వ‌ర్త‌న బాబుకు కూడా త‌ల‌నొప్పులు వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. అవసరమైన సమయాల్లో ఇటు తన పేషీ అధికారులకే కాదు సాక్ష్యాత్తు సిఎంవో అధికారులకు కూడా అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి.అంతే కాదు గ‌డిచిన మూడు మంత్రి వ‌ర్గ‌స‌మావేశాల‌కు డుమ్మా కొట్టారు మంత్రిగారు. ఇంకేముంది బాబు చిర్రెత్తు కొచ్చింది. అంతేనా అసెంబ్లీ స‌మావేశాల‌కు ముందు ఏర్పాటు చేసిన టీడీఎల్పీ స‌మావేశానికికూడా డుమ్మా కొట్టారు.

వ్య‌క్తిగ‌త ప‌నుల‌కు ఇస్తున్న ప్రాధాన్య‌త శాఖావ్య‌వ‌హారాల‌కు ఇవ్వ‌టం లేద‌నె ఆరోప‌న‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. మంత్రి ప‌ద‌వి సంవ‌త్స‌రంనుంచి నిర్వ‌హిస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు శాఖ‌పై ప‌ట్టుసాధించ‌డం లేద‌ని సిబ్బందే చెప్ప‌డం చూస్తె అఖిల త‌న శాఖ‌ను ఏమాత్రం నిర్వ‌హిస్తున్నారో తెలుస్తోంది.

మొన్న జరిగిన బోటు ప్రమాదంకు సంబంధించి మంత్రిపై అన్ని వ‌ర్గాల‌నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఏకంగా ఆమె పేసీ అధికారుల‌నుంచె విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నదిలో తిరగటానికి ఎన్ని బోట్లకు అనుమతులున్నాయో మంత్రికి తెలీదు. ప్రమాదానికి గురైన బోటు ఎవరిదో కూడా చెప్పలేకపోయారు. ఏ శాఖ పరిధిలోకి వస్తోందో వ్యక్తిగత సిబ్బంది చెబితే కానీ మంత్రికి తీవ్రత అర్దం కాలేదట. మృతి చెందిన వారి వివరాలు మంత్రి కన్నా ముందే మీడియాకు చేరిందంటేనే పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు.

పనితీరు మార్చుకోమని చంద్రబాబు అఖిలను హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. శాఖపై పట్టు పెంచుకోలేకపోవటానికి ప్రధాన కారణం శ్రద్ద చూపకపోవటమేనట. త్వ‌ర‌లోనె మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఉండ‌బోతోంది. డిసెంబ‌ర్‌లో జ‌రిగె మంత్రి వ‌ర్గ విస్త‌ర‌న‌లో కొత్త మంత్రి వ‌ర్గంతోనె ఎన్నిల‌కు వెల్ల‌బోతున్నారు బాబు. కొత్త మంత్రి వ‌ర్గ విస్త‌ర‌న‌లో అఖిల పేరు ఉంటుందా లేదా అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -