Saturday, May 18, 2024
- Advertisement -

బాబుపై బాంబు పేల్చిన సీఎస్ : మే 24న జ‌గ‌న్ సీఎంగా ప్ర‌మాణం స్వీకారం చేయ‌వ‌చ్చు

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సీఎం చంద్ర‌బాబు, సీఎస్‌ల మ‌ధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరింది. మే23న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డనున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చినరోజే అధికార పార్టీలు ఓడిపోతే ఆ పార్టీల నేత‌ల ప‌దువులు అన్ని పోతాయి. ఓడిపోతె అదే రోజు హుందాదాగా వెల్లి సీఎం అయితే గ‌వ‌ర్న‌ర్‌కు, ప్ర‌ధాని అయితే రాష్ట్ర‌ప‌తికి రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పిస్తారు. కాని ఏపీలో మాత్రం అందుకు విరుద్దంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు సీఎం చంద్ర‌బాబు.

పూర్తి మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఇప్ప‌టికే అన్ని స‌ర్వేలు కోడై కూస్తుంటే బాబు మాత్రం కొత్త ప‌ల్ల‌విని అందుకున్నారు. ఫ‌లితాలు వైసీపీకీ అనుకూలంగా వ‌స్తె అదే రోజు లేకుంటె మ‌రుస‌టి రోజు ఆపార్టీ అధినేత జ‌గ‌న్ సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌వ‌చ్చు. కాని బాబు మాత్రం కొత్త మెలిక పెడుతున్నారు. తను ఐదేళ్ల కిందట ఆ రోజున ప్రమాణస్వీకారం చేసినట్టుగా, కాబట్టి తను ఈ జూన్ ఎనిమిది వరకూ తనే సీఎం అని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నారు. బాబే కాదు.. ఆ పార్టీ నేతలంతా జూన్ ఎనిమిది అనే పాట పాడుతున్నారు.

బాబు, టీడీపీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌ల‌కు సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం చెక్ పెట్టారు.మే 23న వచ్చిన ఫలితాల్లో టీడీపీ ప్రభుత్వం మరోసారి ఎన్నిక కాకపోతే ఆయన వెంటనే దిగిపోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రేనని, అయితే, ఆయనకు ఎలాంటి అధికారాలు ఉండవని తేల్చి చెప్పారు. స‌మీక్ష‌లు నిర్వ‌హించే అధికారంకూడా బాబుకు లేద‌ని తేల్చిచెప్పారు.

ఎన్నిక‌ల నియ‌మావ‌ళి, రాజ్యాంగం ప్ర‌కారం మే 23న ఎన్నిక‌ల కౌంటింగ్ అనంత‌రం ఫ‌లితాలు వైసీపీ అనుకూలంగా వ‌స్తే వైఎస్ జ‌గ‌న్ ఆ మ‌రుస‌టి రోజే అంటే మే 24వ తేదీ నాడే ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని, ఒక‌వేళ టీడీపీకి అనుకూల ఫ‌లితాలు వెలువ‌డితే చంద్ర‌బాబు త‌న‌కు ఇష్ట‌మొచ్చిన రోజు ప్ర‌మాణ స్వీకారం చేసుకోవ‌చ్చ‌ని సీఎస్ క్లారిటీ ఇచ్చారు. మ‌రి ఇప్ప‌టికైనా తెలుగు త‌మ్ముళ్లు, బాబు ఇప్ప‌టికైనా హుందాగా ప్ర‌వ‌ర్తిస్తే గైర‌వం పెరుగుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -