Friday, May 17, 2024
- Advertisement -

వైసీపీవైపు ఆ భాజాపా ఎమ్మెల్యే చూపు..

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌రకు వ‌స్తున్నాయి అంటే రాజకీయ నాయ‌కుల్లో పండ‌గ వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతోంది. అంతేకాదు ఆయా నియోజ‌కవ‌ర్గాల‌కు చెందిన కీల‌క నాయ‌కులు కూడా తమ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేస్తుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీనుంచి అనేక‌మంది నాయ‌కులు జ‌గ‌న్ స‌మ‌క్షంలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు తాజాగా భాజాపా ఎమ్మెల్యే వైసీపీ తీర్థం పుచ్చుకొనేందుకు సిద్ధంగా ఉన్నార‌న్న వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

రాష్ట్రంలో టీడీపీతో భాజాపా తెగ‌దెంపులుచేసుకోవ‌డం మ‌రో వైపు ప్ర‌త్యేక‌హోదాతోపాటు విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డంలో భాజాపా విఫ‌లం అయ్యిన సంగ‌తి తెల‌సిందే. దీంతో ఏపీ ప్ర‌జ‌లు ఆ పార్టీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో భాజాపాలోనే ఉంటే భ‌విష్య‌త్తు ఉండ‌నే వైసీపీ వైపు చూస్తున్నారు.

భాజాపా కీల‌క నేత ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. సొంత పార్టీని వీడి..వైసీపీలోకి వెల్తున్నారంట‌.విష్ణుకుమార్ రాజుకి పార్టీలనూ, తన నియోజకవర్గంలోనూ మంచి పేరు ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే. బీజేపీ నేతగా కన్నా కూడా వ్యక్తిగతంగా ఆయనను అభిమానించేవారి సంఖ్య ఎక్కువ.

కొద్ది రోజులుగా ఆయన బీజేపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి. జగన్ పాదయాత్ర వైజాగ్ చేరుకుంటే.. ఆ పాదయాత్రలోనే పార్టీ ఫిరాయించాలని ఆయన చూస్తున్నట్లు సమాచారం.

వైసీపీ తీర్థం పుచ్చుకొని.. ఆ పార్టీ గుర్తుతోనే వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలని భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఇదెంత వరకు నిజమో తెలియాలంటే.. మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -