Friday, May 17, 2024
- Advertisement -

ఆ విష‌యంలో బాబు ఫెయిల్‌..? మరి కేసీఆర్ విజ‌యం సాధిస్తారా…?

- Advertisement -

కేంద్రంలో ఒక కొత్త కూటమికి ప్రాణం పోయాలనే ప్రయత్నాలు విషయంలో తెలుగు రాష్ట్రాల చంద్రులిద్ద‌రూ ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే ఇద్ద‌రూ ఒకే దారిలో కాకుండా వ్య‌తిరేఖ దారుల‌లో వెల్తున్నారు. బాబు కాంగ్రెస్ దాని మిత్ర ప‌క్షాల‌తో కొత్త‌కూట‌మిని ఏర్పాటు చేయాలి…కేసీఆర్ కాంగ్రెస్‌, భాజాపాకు వ్య‌తిరేకంగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు వైపు అడుగులు వేస్తున్నారు. ఎవ‌రు జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతార‌నే చ‌ర్చ దేశ‌వ్యాప్తంగా సాగుతోంది.

తెలంగాణా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచిన కేసీఆర్ దూకుడు మీదున్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ జ‌త‌క‌ట్టి ఘోర ప‌రాభం చ‌విచూసింది. దీంతో బాబు నిస్తేజంలో ఉన్నారు. బాబు ప్ర‌స్తుతం రాష్ట్ర‌రాజ‌కీయాల‌పైనే దృష్టి పెట్టారు. సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో బాబు అభ్య‌ర్తుల ఎంపిక విష‌యంలో బిజీగా గ‌డుపుతున్నారు.

అయితే ఇక్క‌డ విష‌యం ఏంటంటే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కూడిన తన కూటమి లోకి తీసుకురావడానికి ఏ పార్టీల విషయంలో ఫెయిలవుతున్నాడో, ఆ పార్టీలతోనే తను ప్లాన్ చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ శ్రీకారం చుడుతున్నాడు.

కూట‌మికి ఏర్పాటుకోసం బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాలకు ఆదిలోనే ఆటంకాలు ఎదుర‌వుతున్నాయి. దేశ ప్ర‌యోజ‌నాల‌కోసం కాకుండా బాబు త‌న సొంత ప్ర‌యోజ‌నాల‌కోసం కూట‌మికోసం పాకులాడుతున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే కీసీఆర్ దేశ దీర్ఘ కాలిక రాజ‌కీయాల ప్ర‌యోజ‌నాల‌కోసం ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుకు చిత్త‌శుద్ధితో ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

కూట‌మి ఏర్పాటుకోసం బాబు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కాంగ్రెస్ అనుకూల కూటమి ఏర్పాటు సమావేశంలో మమతాబెనర్జీ గాని, మాయావతి, అఖిలేష్ గానీ కనిపించలేదు. ఏకంగా అఖిలేష్‌, మాయావ‌తి కూట‌మికి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ కూట‌మిలో చేరేప్ర‌స‌క్తేలేద‌ని తేల్చిచెప్పారు.

అలాగే ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ తో చంద్రబాబు భేటీ కూడా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. దీన్నిబట్టి చూస్తే, చంద్రబాబు వారిని జట్టులోకి తీసుకురావడంలో ఫెయిల్ అయినట్లే అయ్యార‌నే చెప్పాలి. చంద్రబాబు ఫెయిల్ అయిన పాయింట్ దగ్గరే కెసిఆర్ తన ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నారు.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు దిశ‌గా కేసీఆర్ రెండో సారి ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. దీనిలో భాగంగా ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ పర్యటించనున్నారు. అక్క‌డ పలు రాజకీయ పార్టీల అగ్రనేతలను కేసీఆర్ కలవనున్నారు.

త‌న ప‌ర్య‌ట‌న‌లో కేసీఆర్ 23న నవీన్ పట్నాయక్ తో భేటీకావడం అనేది కీలకమైన పరిణామంగా భావించాలి. ఆ వెంటనే 24న ఢిల్లీలో మాయావతితో పాటు, సమాజ్ వాది పార్టీ అధినేత, అఖిలేష్ యాదవ్ తోనూ భేటీ కాబోతున్నారు. మొత్తానికి జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన, ఈ ఇద్దరు చంద్రులలో ఎవరు సఫలం అవుతారో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -