Tuesday, May 7, 2024
- Advertisement -

అధికారంలోకి రావడం కోసం తెలుగువాళ్ళ మధ్య యుద్ధం రగిలించే కుట్రతో బాబు

- Advertisement -

చంద్రబాబుతో సహా పచ్చ బ్యాచ్ మొత్తం కూడా ఎన్నికలు దగ్గరపడేకొద్దీ శివాలెత్తిపోతోంది. ఆ మధ్య వెల్కం గ్రూప్ అంటూ వెలమ-కమ్మ సూపర్ అని కొత్తపలుకు మహదానందంగా రాసిన రాధాకృష్ణ తాజా కొత్తపలుకులో కేసీఆర్‌ని అతిపెద్ద విలన్‌గా చూపడానికి సీమాంధ్రుల్లో సెంటిమెంట్ రగిలించడానికి అష్టకష్టాలూ పడ్డాడు. 2009 ఎన్నికల్లో కేసీఆర్‌తో కోరి మరీ పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నైజం, ఓటుకు కోట్లు కేసులో దొరికిన తర్వాత కేసీఆర్‌కి సాగిలపడ్డవైనం, పరిటాలవారితో సహా సీమాంధ్ర టిడిపి నేతలందరూ కేసీఆర్ అడుగులకు మడుగులొత్తినప్పుడు మాత్రం ఈ జర్నలిస్ట్‌కి, పచ్చబ్యాచ్ జనాలకు సీమాంధ్ర ఆత్మగౌరవం గుర్తుకురాలేదు ఎందుకో మరి. కేసీఆర్ ఎక్కడ నష్టం చేస్తాడో అని చెప్పి సీమాంధ్ర జనాలు, తెలంగాణా ప్రజల మధ్య మరోసారి ద్వేషం రగిలించేలా రెచ్చిపోయి రాతలు రాసేశాడు ఆర్కే. అలాగే సీమాంధ్ర జనాలందరూ కులపిచ్చ జనాలు అన్నట్టుగా రాధాకృష్ణ రాసిన పలుకులు అత్యంత ఆక్షేపణీయం.

ఉద్యమ కాలంలో కేసీఆర్ మాట్లాడిన మాటలు పక్కన పెడితే అధికారంలోకి వచ్చాక మాత్రం సీమాంధ్రులను గొప్పగా చూసుకున్నాడు కేసీఆర్. సినిమా ఇండస్ట్రీ జనాలతో సహా సామాన్యులందరూ కూడా తెలంగాణాలో సంతోషంగానే ఉన్నారు. అందుకే మరోసారి కేసీఆర్‌కి పట్టం కట్టారు. టిడిపి మంత్రి నారాయణ కుమారుడు చనిపోయినప్పుడు, నందమూరి హరికృష్ణ చనిపోయినప్పుడు కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ నాయకులు అందరూ ఏ స్థాయిలో ప్రేమాభిమానాలు చూపించారో చెప్పనవసరం లేదు. ఓటుకు నోటు కేసు తర్వాత వెలమ-కమ్మ గ్రూప్ వెల్కం అంటూ అందరూ బాగానే కలిసిపోయారు.

అయితే ఇప్పుడు కేవలం అధికారం కోసం అత్యంత దారుణమైన వ్యూహాలతో తెలుగు వాళ్ళ మధ్య మరోసారి విద్వేషాలు రగిలించే దిశగా వ్యూహం పన్నుతున్నారు పచ్చబ్యాచ్. అధికారం కోసం ఎంతకైనా తెగించే ఈ నాయకుల చర్యలు, మాటలు చూస్తూ మేధావులు కూడా ఆవేధన చెందుతున్న పరిస్థితి. సీమాంధ్ర ప్రజల్లో కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషం రగిలించేలా టిడిపి నాయకులు రచిస్తున్న కుట్రవ్యూహాల పట్ల అసహ్యం పెరుగుతోంది. అయితేనేం అధికారమే పరమావధిగా ఎన్నికలు దగ్గరపడేవరకూ ఈ పచ్చ బ్యాచ్ జనాలు, నాయకులు ఇంకా ఏ స్థాయికి దిగజారుతారో అనే భయం కలిగేలా రాజకీయాలు చేస్తున్నారని విశ్లేషకులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -