Friday, May 17, 2024
- Advertisement -

అమాయకత్వమా? అజ్ఙానమా? ఎందుకీ మోసం? ఎవరికోసం ఈ డ్రామాలు?

- Advertisement -

మళ్ళీ మొదలెట్టారు. నాలుగేళ్ళుగా ఇవే డ్రామాలు. 2004వరకూ సాగిన పాలనా కాలంలో కూడా ఇదే హంగామా. కాకపోతే ఈ సారి టెక్నాలజీతో పాటు వ్యవసాయాన్ని కూడా చేర్చి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అంతా కూడా బండారమే అన్న విషయం కాస్త ఆలోచనలు ఉన్న వాళ్ళకు ఎవరికైనా అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఐటి రంగం విస్తృతమవుతున్న దశలో ఇండియాలో వనరులు అవకాశం ఉన్న హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై లాంటి మహానగరాలు అభివృద్ధి సాధించాయి. ముంబైలో శివసేన రాజకీయాలు, చెన్నై వాసుల సంకుచితత్వం నేపథ్యంలో అలాంటి సమస్యలు లేని బెంగుళూరు, హైదరబాద్‌లు కాస్త ఎక్కువ అభివృద్ధి సాధించాయి. హైదరాబాద్ కంటే బెంగుళూరే ఎక్కువ అభివృద్ధి సాధించింది. ఆ రకంగా చూసుకుంటే చంద్రబాబుకంటే అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ ఎక్కువ సమర్థుడన్నట్టా? ఇక బాబు తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎష్ హయాంలో సాఫ్ట్‌వేర్ ఎగుమతులు గణనీయంగా వృద్ధి చెందాయని అధికారిక లెక్కలే చెప్తున్నాయి. ఇప్పుడు కేసీఆర్ పాలనలో కూడా అభివృద్ధి చెందుతూనే ఉన్నాయని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కాకపోతే చంద్రబాబులా వైఎస్, కెసీఆర్‌లు పబ్లిసిటీ కోసం పాకులాడలేదు. అదీ తేడా.

ఇక 2014 నుంచీ కూడా చంద్రబాబు ఒకటే ప్రచార డ్రామాలు ఆడుతున్నాడని జాతీయ స్థాయిలో మేధావులు చెప్తున్నారు. చంద్రబాబును మించిన నటుడు లేడు అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే విమర్శించాడంటే బాబు డ్రామాలు అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు దావోస్‌కి కెటీఆర్‌కి అధికారికంగా ఆహ్వానం అందింది. చంద్రబాబు, లోకేష్‌లది మాత్రం సొంత వ్యవహారం. కానీ ఇద్దరూ కూడా బ్రహ్మాండమైన షో చేస్తున్నారు. ప్రతిరోజూ టిడిపి భజన మీడియాలో కంపెనీలు, ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని ఊదరగొట్టేస్తున్నారు. మూడున్నరేళ్ళుగా ఇదే తంతు.

మరి ఇవన్నీ వాస్తవాలే అయితే రీసెంట్‌గా మోడీ కలిసిన సందర్భంలోనూ, ఆ తర్వాత మరో ప్రస్‌మీట్‌లోనే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వెనుకపడిపోయి ఉంది. వడ్డీలు కూడా చెల్లించలేకుండా ఉన్నాం, కేంద్రం ఆదుకోకపోతే అథోగతే అనే స్థాయిలో ఎందుకు ఆర్తనాదాలు వినిపించినట్టు. ఒక వైపు ప్రధాని కంటే ఎక్కువ దేశాలు పర్యటించిన ముఖ్యమంత్రి, స్పెషల్ ఫ్లైట్స్ హంగమా…..అన్నీ భారీ వ్యవహారాలు…….ప్రపంచంలో ఉన్న కంపెనీలన్నీ ఎపికి వస్తున్నాయని ప్రచార డాంభికాలు…….మరోవైపు ఎపి అథోగతి పాలవుతోందని ఆర్తనాదాలు………ఎందుకు ఈ డ్రామాలు? ఎవరిని మోసం చేయడానికి? అధికారంలో ఉండాలన్న యావ తప్ప అధికార భోగం దక్కడానికి కారణమైన ఆంధ్రప్రదేశ్ గురించి, ప్రజల గురించి పట్టించుకోరా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -