Friday, May 17, 2024
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగిన చంద్రబాబు…. న్యాయం చేయాలని డిమాండ్

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీమాంధ్ర ప్రజలకు తీవ్రంగా అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ టిడిపి అధినేత చంద్రబాబు ఆందోళన చేశారు. 2014 నుంచీ ఇప్పటి వరకూ కూడా రాష్ట్ర ప్రజల కష్టాలను అస్సలు పట్టించుకోవడం లేదని, విభజనతో అన్నీ నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ని ప్రభుత్వం ఇంకా అష్టకష్టాలకు గురిచేస్తోందని చంద్రబాబు ఆరోపించారు.

ఐటి శాఖకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అస్సలు కేటాయింపులు చేయడం లేదని, ఐటి శాఖ అభివృద్ధిని చంద్రబాబు అస్సలు పట్టించుకోవడం లేదని నారా లోకేష్ ఆందోళన చేశారు. ఈ వార్తలన్నీ కూడా హాస్యాస్పదంగానూ, విచిత్రంగానూ ఉన్నాయి కదా. ప్రజలు మరీ అజ్ఙానులన్న ప్రగాఢ నమ్మకం ఉంటే తప్ప ఇలాంటి వింతలు చోటు చేసుకోవు. ప్రజల ఆలోచనా శక్తిని ఎంత తక్కువగా అంచనా వేస్తారో తెలియదు కానీ టిడిపి అధినేత చంద్రబాబు మాత్రం ఇలాంటి డ్రామాకే తెరలేపుతున్నారు.

నరేంద్రమోడీ ప్రభుత్వంతో టిడిపి భాగస్వామి. టిడిపి నుంచి ముఖ్యమైన శాఖలకు ఇద్దరు కేబినెట్ మంత్రులు కూడా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ కేబినెట్ మంత్రుల భాగస్వామ్యం ఉంటుంది, అన్ని విషయాలు కూడా కేంద్ర మంత్రులకు ముందే తెలుస్తాయి. అలాంటి కేబినెట్ మంత్రులుగా టిడిపి ఎంపిలు ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా, టిడిపి-బిజెపిల ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తోందని చెప్పి టిడిపి ఎంపిలు, నాయకులు డ్రామా నడపడం కూడా ఇంతే వింతగా ఉంది. ఎవరిని నమ్మించడానికి ఈ షోలు? ఆ మధ్య ప్రత్యేక హోదా విషయంలో కూడా ఇలాంటి పోరాట డ్రామాలే నడిపారు టిడిపి ఎంపీలు. ఆ ఆందోళనలో పాల్గొన్న జేసీ దివాకరరెడ్డినే……..‘పోరాటమా ……..వంకాయా……డ్రామా అంతే’ అన్నట్టుగా నిజాలు మాట్లాడేశాడు. ఆ తర్వాత ప్రత్యేక హోదా విషయం ఏమైందో మనందరికీ తెలుసు. ఇప్పుడు చివరి బడ్జెట్‌లో అన్యాయం తర్వాత కూడా చంద్రబాబు అదే డ్రామాలు నడిపిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరీ అమాయకులుగా జమ కట్టేస్తున్నాడు.

చివరి బడ్జెట్‌లో కూడా అన్యాయం చేశాక, హోదా, రైల్వేజోన్, రాజధాని నిర్మాణం లాంటి అన్ని విషయాల్లోనూ నాలుగేళ్ళుగా అన్యాయం చేసిన మోడీ ప్రభుత్వంతో చంద్రబాబు ఇంకా చర్చలు చేస్తాడట. ఫోన్‌లలో మాట్లాడి ఒత్తిడి తెస్తారట. సంవత్సరన్నర కాలం పాటు చంద్రబాబుకి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. నాలుగేళ్ళుగా చేసింది ఏమీ లేదు. కానీ చంద్రబాబు మాత్రం ఈ నాలుగేళ్ళుగా చర్చలు, సమన్వయం చేసుకుంటాం, సాధిస్తాం అంటూ కాలం గడిపేశాడు. ఇంకెంత మహా అయితే ఇంకా ఆరునెలలు. ఎలాగూ మోడీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ఖాయం కాబట్టి ఆరు నెలలు ఇదే డ్రామాలు, ఇవే సినిమాలు జనాలకు చూపిస్తే చాలు. చంద్రబాబు చించెస్తున్నాడని పచ్చ మీడియా బాకా ఊదుతూ ఉంటుంది. ఎన్డీఏ నుంచి విడిపోవద్దని బాబుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కాల్ చేశాడని చెప్తుంది. జనాల చెవుల్లో పూలు పెట్టడానికి గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇలాంటి పూలు చెవుల్లో పెట్టే 2014లో మోసం చేశారు. 2019లో కూడా అలానే చేయగలరా? చంద్రబాబు తక్కువ అంచనా వేస్తున్న స్థాయిలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -