Friday, May 17, 2024
- Advertisement -

మోడీతో బాబు భేటీ…… రాజకీయ అవసరాలా? రాష్ట్ర అవసరాలా?

- Advertisement -

మొత్తానికి శ్రీమాన్ చంద్రబాబునాయుడుగారు సాధించారు. ప్రపంచానికే పాఠాలు చెప్పా……దేశంలోనే నాకంటే సీనియర్ నాయకుడు లేరు…….నా అంత తోపు, తరుంఖాన్ ఎవరూ లేరు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడుగారు సాధించారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం సాధించి పెట్టారా అని ఆలోచిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో రెండు కళ్ళ సిద్ధాంతంతో, విభజన తర్వాత అత్యంత కీలకమైన మొదటి టెర్మ్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు…..విభజన చట్టంలో ఉన్న హామీలన్నింటినీ తుంగలో తొక్కేస్తూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలను చాలానే సాధిస్తున్నాడుగా. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలను కొత్తగా సాధించడానికి ఏం ఉంది? ఇది ఆ సాధింపు వ్యవహారాల గురించి కాదు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న చంద్రబాబుగారు ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ సాధించడం గురించి. ఎమ్మెల్యేల నుంచి ఎంపిల వరకూ, కేంద్రమంత్రులు, బ్యూరోక్రాట్స్‌తో పాటు ప్రతిపక్ష నాయకులకు కూడా చాలా సులభంగానే దక్కిన ప్రధానమంత్రి దర్శనభాగ్యం……..సీనియర్ మోస్ట్ నాయకుడైన చంద్రబాబుకు మాత్రం ఓ మహాయజ్ఙంలాంటి ప్రయత్నం తర్వాత సాధ్యమైంది. టిడిపి ఎంపిలు, మంత్రులు నానా తంటాలు పడి అపాయింట్‌మెంట్ మాత్రం సాధించిపెట్టగలిగారు.

అపాయింట్‌మెంట్ అలా ఫిక్స్ అయిందో లేదో ఇక బాబుగారి భజన బ్యాచ్ మొత్తం బాకాలతో రెడీ అయింది. ప్రత్యక హోదా, ప్యాకేజ్, రైల్వేజోన్, పోలవరం, రాజధాని నిధులు…..లాంటి అన్ని విషయాల్లోనూ మోడీతో భేటీలో తేల్చేయడానికి చంద్రబాబు సిద్ధపడుతున్నాడని, మోడీని నిలదీయడంలో వెనక్కితగ్గకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నాడని……..అబ్బో బాలయ్య బాబు సినిమాల్లో కూడా వినిపించని డైలాగులు వినిపిస్తున్నారు.
ఈ మొత్తం భజనలో నిజమెంతో తెలుసుకోవడానికి మోడీ-బాబుల భేటీ సమయంలో వాళ్ళ సమక్షంలో ఉండాల్సిన అవసరం కూడా లేదు. మోడీతో భేటీ అయ్యాక బయటికొచ్చిన చంద్రబాబు మాటలు వింటే చాలు… సినిమా మొత్తం అర్థమైపోతుంది. మోడీతో భేటీ అయ్యాక చంద్రబాబు ఏం చెప్తాడో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాలను మోడీతో చర్చించాను. అన్నీ సానుకూలంగా విన్నారు. పరిస్థితులను తెలుసుకుని మోడీ కూడా బాధపడ్డారు. ఆంధ్రప్రదేశ్ తనకు అత్యంత ప్రత్యేకమైన రాష్ట్రం అని చెప్పారు, వీలైనంత త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైన అన్ని సహాయాలు చేసేలా అన్ని చర్యలూ తీసుకుంటాం అని మోడీ చెప్పాడు అని చంద్రబాబు చెప్తాడు. పనిలో పనిగా కడు పేద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అద్భుత సేవలు అందిస్తున్నారని మోడీ తనను అభినందించాడని కూడా చెప్పుకుంటాడు.

అంతకుమించి చంద్రబాబు నోటి వెంట డిమాండ్ చేశాను, నిలదీశాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తేడా వస్తే తెగదెంపులకు కూడా రెడీ అన్న మాటలు మాత్రం అస్సలు రావు. అలాంటి మాటలన్నీ కూడా ఆయన భజన పత్రిక యజామని ఓపెన్ హార్ట్ సర్జన్ రాతల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అపాయింట్‌మెంట్ తెచ్చుకోవడానికే అపసోపాలు పడినవాళ్ళు……మీటింగ్‌లో రాష్ట్ర ప్రయోజనాల విషయమై మోడీని నిలదీశాం అని చెప్పే ధైర్యం లేని వాళ్ళు…….ఆంధప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను తీసుకొస్తాం అని చెప్తే నమ్మే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారా? విభజన సమయంలోనూ, 2014 ఎన్నికల్లోనూ మోడీ, చంద్రబాబుల చేతుల్లో దగాపడ్డ ఎపి ప్రజలు మరోసారి మాయమాటలకు మోసపోతారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -