Thursday, May 16, 2024
- Advertisement -

ఫార్టీ ఫిరాయింపుల‌ను నంద్యాల ప్ర‌జ‌లు స‌మ‌ర్థించే ఓటేశారా…?

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక‌లో అధికార టీడీపీ పార్టీ అత్య‌ధిక మెజారిటీతో గెలిచింది. ఎవ‌రైనా ఒక‌రే గెలుస్తారు. గ‌తంలో నైతిక‌త‌, అనైతిక‌త గెలుపు అనే మాట‌లు వినిపించేవి. కాని ఇప్పుడు అలాంటివి ఎక్క‌డా క‌నిపించ‌వు. ప్ర‌స్తుతం నైతిక‌త అనే ప‌దం క‌నుమ‌రుగ‌య్యింద‌నె చెప్పాలి.

ఉప ఎన్నిక‌లో ప్ర‌భుత్వ అభివృద్ధి మంత్ర‌మే గెలిచింది… భూమా నాగిరెడ్డి సింప‌తికూడా తోడ‌య్యింద‌ని అధికార పార్టీ చెప్పుకోవ‌డంలో త‌ప్పులేదు. కానీ పార్టీ ఫిరాయింపుల‌ను ఓట‌ర్లు స‌మ‌ర్ధించార‌ని అధికార‌పార్టీ చెప్పుకుంటోంది. ఉప ఎన్నిక‌లు అనేవి ప్ర‌త్యేక ప‌రిస్థితులల్లో జ‌రుగుతాయ‌నేది అంద‌రికి తెలిసిందే. ప్ర‌ధానంగా ఆ నియేజ‌క‌వ‌ర్గంలో ఉన్న పరిస్థితుల‌కు అనుగునంగా ఎన్నిక జ‌రుగుతుంది.

ఇక్క‌డ నిశితంగా గ‌మ‌నిస్తే ఫిరాయింపు అంశంగాని, ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌గాని ఏవి ప‌నిచేలుదు. సిట్టింగ్ ఎమ్మెల్యే చ‌నిపోయారు…ఆ కుటుంబంనుంచి పోటీలో నిలిచారు. భూమా అఖిల‌ప్రియ‌, మౌనిక‌, త‌ల్లిదండ్రులు కోల్పోయిన అనాధల్లా ‘చిన్న పిల్లలు’ జనం వద్దకు వచ్చారు.. ఇవే, ఈ ముఖ్యమైన అంశాలే నంద్యాల ఉప ఎన్నికలో కీలక భూమిక పోషించాయి. దీనికి తోడు రూ.1500 వంద‌ల కోట్లు అభివృద్దిప‌నులు, డ‌బ్బు,అధికారం అన్నీ క‌ల‌సి వ‌చ్చాయి.

నంద్యాలలో గెలిచామ‌ని ఇకపై ఎవరూ పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడకూడదనీ, పార్టీ పిరాయించినవారు రాజీనామా చేయాలనే డిమాండ్‌ ప్రతిపక్షం నుంచి రాకూడదనీ మంత్రి అఖిలప్రియ చెబుతున్నారు. సాక్ష్యాత్తు చంద్ర‌బాబునాయుడే తెలంగాణాలో ఎమ్మెల్యేలు చేజారిన‌పుడు … అవేశంగా పార్టీ ఫిరాయింపుల్ని రాజ‌కీయ వ్య‌భిచారంగా మాట్లాడారు.

నంద్యాల‌లో పార్టీ పిరాయింపుల‌కే ఓట‌ర్లు అనుకూలంగా ఓటేశార‌నుంకుంటె …. టీడీపీ క‌న్నా కాస్త‌త‌క్కువ‌గా అయినా ప్ర‌తిప‌క్షానికి ఓట్లు వేశారు. ఇవ‌న్నీ చూస్తె బాబుపై జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల్నిఅంగీక‌రించార‌నుకోవాలా…? గెలుపు మెజార్టీతో మాత్రమే దక్కిందనీ.. మెజార్టీ అంటే యునానిమస్ కాదనీ అఖిల ప్రియ‌కు అనుభం ఎప్పుడొస్తుందో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -