Thursday, May 16, 2024
- Advertisement -

టీడీపీ చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు భ‌య‌ప‌డొద్దు…. ఎదురుదాడి చేయండి…

- Advertisement -

ఏపీలో టీడీపీకి విడాకులు ఇచ్చేందుకు భాజాపా సిద్ద‌మ‌య్యింది. ఆ దిశ‌గా రాష్ట్ర‌నాయ‌క‌త్వానికి భాజాపా ఛీఫ్ అమీత్‌షా సంకేతాలు పంపారు. తాజాగా ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో ఏపీకీ పంప‌గ‌నామాలు పెట్టిన సంగ‌తి తెలిసందే. దీనిపై బాబు అండ్ కో మోదీపై గుర్రుగా ఉన్నారు.

గురువారం సాయంత్రం అమిత్ షాతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు, శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు ఢిల్లీలో సమావేశమయ్యారు. టీడీపీ అనుసరిస్తున్న వైఖరి గురించి నేతలు ఆయనకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా వారికి అమిత్ షా పలు సూచనలు చేశారు

దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలకు కీలక సూచనలు చేశారు. కేంద్రంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు భయపడాల్సిన పని లేదన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు ఇప్పటికీ కేంద్రం పరిశీలనలో ఉందన్నారు. నిపుణుల అభిప్రాయం దీనికి వ్యతిరేకంగా ఉన్నా కేంద్రం మాత్రం సానుకూలంగా పరిశీలిస్తోందని రాష్ట్ర బీజేపీ నేతలకు సమాధానమిచ్చారు.

ఏపీ అడిగినవన్నీ ఇస్తూనే ఉన్నామని చెప్పిన అమిత్, పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని, టీడీపీ విమర్శలకు దీటైన జవాబులు ఇవ్వాలని సూచించారు. అమరావతికి సంబంధించిన డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రోగ్రసివ్ రిపోర్ట్)ను ఇప్పటివరకూ ఇవ్వకపోయినా, నిధులను మాత్రం అందిస్తూనే ఉన్నామని గుర్తు చేశారు.

ఇక అసెంబ్లీ సీట్లను పెంచే విషయంలో గంపెడాశ‌లు పెట్టుకున్న బాబు ఆశ‌లు కూడా అడియాశ‌ల‌య్యాయి.సీట్ల‌పెంపు విష‌యంలో బీజేపీ నేతల అభిప్రాయాన్ని అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. తాను త్వరలోనే రాష్ట్రంలో పర్యటిస్తానని, ఈదఫా రాయలసీమలో తన పర్యటన ఉంటుందన్న సంకేతాలను ఇచ్చారు. దీన్ని బ‌ట్టి చూస్తే ఇచ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో క‌టీఫ్ అన‌డంలో సందేహంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -