Thursday, May 16, 2024
- Advertisement -

ముగిసిన కస్టడీ…14గంటల విచారణ

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కస్టడీ,రిమాండ్ నేటితో ముగిసింది. సీఐడీ అధికారులు చంద్రబాబును 5 రోజుల కస్టడీకి కోరగా రెండు రోజుల పాటు విచారణకు అనుమతిచ్చింది న్యాయస్థానం. ఇక రెండు రోజుల పాటు సీఐడీ అధికారులు చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించగా ఆయన చెప్పిన సమాధానాన్ని రికార్డ్ చేశారు. రెండు రోజుల విచారణకు సంబంధించిన నివేదికను, వీడియో ఫుటేజీని సీల్డ్ కవర్ లో కోర్టుకి సమర్పించారు. ఇక చంద్రబాబును వర్చువల్‌గా న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా రిమాండ్, కస్టడీ పిటిషన్‌ను పొడగించాలని కోరారు సీఐడీ అధికారులు.

ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఉన్నారు. ఆయన కోసం ప్రత్యేక బారక్‌ను కేటాయించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు రిమాండ్, కస్టడీ ముగియడంతో ఆయనకు బెయిల్ వస్తుందా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.

దాదాపు రెండు రోజుల పాటు 14 గంటల పాటు విచారించారు. స్కిల్ స్కామ్ కేసులో 140 మంది సాక్షులు ఇచ్చిన ఇన్ పుట్స్ ను చంద్రబాబు ముందు ఉంచి ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. స్కాంకు సంబంధించి పక్కా ఆధారాలను చంద్రబాబు ముందు ఉంచి ప్రశ్నలు అడిగారు. నిధులు ఎందుకు కేటాయించాల్సి వచ్చింది, షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు, స్కిల్ సెంటర్ లో ప్రపోజల్ లో ఉండగానే నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఇలా వీలైన అన్ని కోణాల్లో చంద్రబాబు నుండి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. దాదాపు 120 ప్రశ్నలు చంద్రబాబును అడగ్గా ఆయన నుండి అనుకున్న సమాచారాన్ని రాబట్టారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -