Thursday, May 16, 2024
- Advertisement -

ఇంకా తెలివిరాలేదా….. కాంగ్రెస్ తరపున ఆ బాధ్యత బాబు తీసుకుంటాడా?

- Advertisement -

ప్రత్యేక హోదా పాపం మోడీదా? చంద్రబాబుదా అనే విషయంలో కర్ణాటక తెలుగు ప్రజలు చాలా స్పష్టంగా తీర్పిచ్చారు. ఎన్నికలవగానే హోదా వేస్ట్ అంటూ నాలుక మడతేసి ఆ తర్వాత ప్యాకేజ్ బెస్ట్ అంటూ స్వార్థ రాజకీయం చేసిన చంద్రబాబును కన్నడ తెలుగు ప్రజలు నమ్మలేదు. ప్యాకేజ్ నిధులన్నీ కూడా స్పషల్ పర్సస్ వెహికల్ ఏర్పాటు చేసి ఖర్చుపెట్టేలా చేస్తాం అని కేంద్రం అన్న తర్వాతే…అలా చేస్తే తనకు, తనవాళ్ళకు తినడానికి ఏం ఉంటుంది అన్న ఉద్ధేశ్యంతో ప్యాకేజ్ విషయంలో మళ్ళీ నాలుక మడతేసి ప్రత్యేక హోదాకు జైకొట్టిన బాబు రాజకీయ అడుగులన్నీ తెలుగు ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. చంద్రబాబు బిజెపిని ఓడించాలని పిలుపిస్తే గతంలో ఎన్నడూ బిజెపిక ఓట్లు వేయనంతమంది తెలుగు ప్రజలు ఈ సారి బిజెపికి ఓట్లేశారు. అలాగే తెలుగు ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ గెలవనన్ని సీట్లలో ఈ సారి బిజెపి గెలిచింది. ప్రజలు ఇంత స్పష్టంగా చంద్రబాబు దోషి అని తీర్పిచ్చినప్పటికీ ఇప్పుడు మరో తప్పు చేయడానికి కూడా రెడీ అవుతున్నాడు చంద్రబాబు.

కాంగ్రెస్-జెడీఎస్‌లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం ఆంధ్రప్రదేశ్‌లో క్యాంప్ నిర్వహించడానికి బాబు రెడీ అయిపోయాడు. జగన్‌ని జైలుకు పంపించడం, కిరణ్ కుమార్ రెడ్డిని కాపాడిన రోజుల నుంచీ కూడా సోనియాతో బాబు చీకటి బంధం గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కూడా కాంగ్రెస్‌తో బాబు సాన్నిహిత్యం కారణంగానే బిజెపి బాబును పట్టించుకోవడం మానేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం అని చెప్పి కన్నడ నాట బిజెపిని ఓడించమని బాబు పిలుపు ఇవ్వడం వెనకాల కూడా కాంగ్రెస్‌కి లాభం చేకూర్చాలన్న రాజకీయ స్వార్థమే ఉందన్నది నిజం. ఇన్ని చేశాక కూడా…….తెలుగు ప్రజలు బాబుకు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చాక కూడా ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండడం కోసం ఆంధ్రప్రదేశ్ నాట చంద్రబాబు క్యాంప్ రాజకీయాలు నడుపుతానని ముందుకు రావడం మాత్రం రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్ఛర్యపరుస్తోంది. అధికారం అప్పగించిన ఆంధ్రప్రదేశ్‌ని గాలికి వదిలేస్తూ తన రాజకీయ స్వార్థం కోసం అధికారాన్ని చంద్రబాబు వాడుకుంటున్న వైనంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -