చంద్రబాబు నాయుడు ప్రేమలో పడ్డారు. అవును. ఈ వయసులో ప్రేమా దోమ ఏమిటీ అనుకుంటున్నారా? కానీ, బాబుగారు ఊరికే ప్రేమించరు.. ఊరికే బ్రేకప్ చెప్పరని రాజకీయ వర్గాల్లో ఉండే టాక్. ఆయన ప్రతిపనికి ఒక లెక్కుంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. వచ్చేఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావటమే ఆయన టార్గెట్. దానికోసం ఏం చేయాలా అని స్కెచ్ వేస్తున్నారు. ఆ స్కెచ్ లో భాగంగానే ఇప్పుడు కొత్తగా ప్రేమిస్తున్నారట. ఈ ధోరణిలో కుప్పంలో బాబుగారి మాటలు సంచలనంగా మారాయి.
అసలు విషయానికి వస్తే, చంద్రబాబు కుప్పం పర్యటనలో, జనసేనతో పొత్తు ప్రస్తావన వచ్చింది. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను కూడా కలుపుకుపోవాలని చంద్రబాబును టిడిపి నేతలు కోరారు. దీనిపై స్పందించిన బాబు లవ్ ఎప్పుడూ రెండు వైపులా ఉండాలన్నారు. వన్ సైడ్ లవ్ సరికాదన్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఒక్కటిగా పనిచేస్తాయని కొంత ప్రచారం ఉంది.కానీ, అదే సమయంలో పవన్ కల్యాణ్ తీరుపై టిడిపి నేతల్లో అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా బాబుగారు వన్ సైడ్ లవ్ సాగిస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట
చంద్రబాబు ఈ మాట అనగానే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అంతెత్తున ఎగిరి పడ్డారు. చంద్రబాబు అవసరమైనప్పుడు ఎవరినైనా ప్రేమిస్తారన్నారు. ఈ విషయంలో ఆయన చాలా సమర్థుడన్నారు. 1996 నుంచి ఆయన అన్ని పార్టీలను వరుసగా లవ్ చేస్తున్నాడని అవసరం తీరాక వదిలేస్తాడని కామెంట్ చేశారు.
స్ట్రీట్ ఫుడ్ డోర్ డెలివరీ కావాలా?
నేరస్తుణ్ని ఇలా కూడా పట్టుకుంటారా?