ఏపీ ఉగ్యోగులకు తీపి కబురు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్ మెంట్ ను ప్రకటించింది. అలాగే ఉద్యోగుల వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ జీవోను జారీ చేసింది. ఈ యేడాది జనవరి ఫిట్ మెంట్ అములు కానుంది. కాగా మానిటరీ బెనిఫిట్ ఏప్రిల్ 1 నుంచి అములు కానుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఉద్యోగుల సంక్షేమాన్ని ద్రుష్టిలో ఉంచుకొని ఫిట్ మెంట్ ను ప్రకటించామని సీఎం వైఎస్ . జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.

ఈ మేరకు జగన్ పేరుతో ప్రభుత్వం ఒక ప్రకటనను విడుల చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు సుదీర్ఘ కాలం పాటు ప్రజా సేవలో జీవితం గడుపుతారు. వారి సేవలను మరింతగా ఉపయోగించుకోవాలనే నిర్ణయంతోనే రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతున్నాం. మెరుగైన ఫిట్ మెంట్ ను అమలు చేస్తున్నాం అని సీఎం తెలిపారు.

ఇక కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్‌)‌పై కేబినెట్‌ సబ్ కమిటీనపి వేశామని, జూన్‌ 30 లోగా ఒక నిర్ణయం తీసుకుంటామని జగన్ తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా ప్రభుత్వ ఉద్యోగులు పాత పెన్షన్ పద్దతిని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రధాని భద్రత వైఫల్యం తీవ్రమైన అంశం : సుప్రీం

స్ట్రీట్‌ ఫుడ్‌ డోర్ డెలివరీ కావాలా?

నేరస్తుణ్ని ఇలా కూడా పట్టుకుంటారా?

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -