Friday, March 29, 2024
- Advertisement -

స్ట్రీట్‌ ఫుడ్‌ డోర్ డెలివరీ కావాలా?

- Advertisement -

ఆకలేస్తే అన్నం పెట్టడానికి, నాలుక చప్పబడితే బిర్యానీలు, నాన్‌ వెజ్‌ స్పెషళ్లు తెచ్చివ్వటానికి స్విగ్గీ, జొమాటో లాంటి యాప్‌ లు పుష్కలంగా తయారయ్యాయి. సిటీల్లోనే కాదు.. చిన్నపాటి పట్టణాలకు కూడా ఈ సర్వీసులు విస్తరిస్తున్నాయి. అయితే, పెద్ద పెద్ద హోటళ్ల నుండే కాదు, స్ట్రీట్‌ ఫుడ్‌ కూడా ఆర్డర్‌ ఇచ్చి తెప్పించుకునే అవకాశం రాబోతోంది.

చాలామందికి పెద్ద హొటల్స్‌ కంటే స్ట్రీట్‌ ఫుడ్‌ పైనే ఆసక్తి ఎక్కువుంటుంది. ఆ స్థాయిలో, ఆ మాటకొస్తే అంతకంటే రుచి శుచిగా అందించే రోడ్‌ సైడ్‌ హోటళ్లు చాలానే ఉంటాయి. ఎటొచ్చీ, అలాంటి చోట తినాలంటే అక్కడికి వెళ్లటం తప్ప మరో మార్గం లేదు. డోర్‌ డెలివరీ కావాలంటే పెద్ద హోటల్స్‌ ఫుడ్‌ తెప్పించుకోవలసిందే.

కానీ, ఇప్పుడు సీన్‌ మారుతోంది. చిరు వ్యాపారులను కూడా స్విగ్గీ, జోమాటోలలో భాగస్వాములను చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. జీహెచ్‌ఎంపీ సర్కిల్‌ 17, 18లో దీనికి సంబంధించిన పైలెట్‌ ప్రాజెక్టు రూపొందిస్తున్నారు. ఇది పట్టాలెక్కితే సందు చివర బండి మీద నుంచి కావలసి ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకునే వీలుంటుంది.

ఎన్నికలని ఆపలేని ఒమిక్రాన్‌

నేరస్తుణ్ని ఇలా కూడా పట్టుకుంటారా?

హై అలర్ట్‌ .. థర్డ్‌ వేవ్‌ వచ్చేసింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -