Thursday, May 16, 2024
- Advertisement -

2019 ఎన్నిక‌ల్లో బాబు గెలుపుకు అడ్డ‌దారులు ఇవే..?

- Advertisement -

అందరూ అనుమానిస్తున్నట్లుగానే వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు టిడిపి అడ్డదారులు తొక్కుతోంది. వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు జన స్పందన చూసిన తర్వాత టిడిపిలో టెన్షన్ పట్టుకున్నట్లుంది. ప్రభుత్వంపై జనాల్లో 80 శాతం సంతృప్తి ఉందని ఎన్నిక‌లు జ‌రిగితే 175 సీట్లూ టిడిపివే అంటూ ఒకటికి పదిసార్లు నేతల సమావేశాల్లో ఢంకా బజాయించిన సంగ‌తి తెలిసిందే.

సొంత జిల్లా కాబట్టి కడపలో ఏదోలే జనాలు వచ్చారనుకున్నారు. కానీ రాయలసీమలోనే కాకుండా ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కూడా ప్రజలు విపరీతంగా స్పందిస్తున్నారు. దాంతో టిడిపిలో ఆందోళన మొదలైనట్లుంది. అందుకే వచ్చే ఎన్నికల వరకూ ఆగకుండా ఇపుడే అడ్డదారులు తొక్కుతోంది. అందుకే ఓటర్ల జాబితా నుండి వైసీపీకీ అనుకూలంగా ఉన్న ఓట్ల‌ను తొల‌గించింది.

రాష్ట్రంలోని అన్నీ నియోజకవర్గాల్లోనూ వైసిపి మద్దతుదారుల ఓట్లు అన్నఅనుమానం వస్తే చాలా ఓటర్ల జాబితా నుండి పేర్లను తొలగిస్తున్నారు. ఇప్పటికీ ప్రతీ నియోజకవర్గం నుండి వేలాది ఓట్లను అధికారులు తొలగించేశారు. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి మున్సిపాలిటిలోనే సుమారు 10 వేల ఓట్లను తొలగించారు. ఇది స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు సొంత నియోజకవర్గం. చిలకలూరిపేటలో 9 వేలు, నరసరావుపేటలో 20 వేల ఓట్లను అధికారులు తొలగించారు.

రాష్ట్రంలోని గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, నెల్లూరు, కడప, కర్నూలు లాంటి చాలా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయి. విచిత్రమేమిటంటే గల్లంతైన ఓట్లన్ని కూడా వైసిపికి మద్దతుదారులవే అన్న ఆరోపణలు వినబడుతున్నాయి. అందుకనే వైసిపి నేతలు మాత్రమే గగ్గొలు పెడుతున్నారు. అదే విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమీషనర్ ఆర్పీ సిసోడియాను కలిసి వైసిపి నేతలు ఫిర్యాదు చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై నమ్మకం లేకనే టిడిపి అడ్డదారులు తొక్కుతోందంటూ వైసిపి నేతలు మండిపోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -