Friday, May 17, 2024
- Advertisement -

ముందు జాగ్రత్త…. తూ.గోలో సంకల్పయాత్ర జోరుకు బ్రేక్స్ వేస్తాడా?

- Advertisement -

అత్యంత అనుభవజ్ఙుడిని అని 2014 ఎన్నికల సందర్భంగా చెప్పుకున్న చంద్రబాబు అనుభవం పేరు చెప్పి ఓట్లు కొల్లగొట్టడంలో మాత్రం బాగానే సక్సెస్ అయ్యాడు. ఇక ఆ తర్వాత నుంచీ అన్ని విషయాల్లోనూ జగన్‌ని ఫాలో అవుతూ ఉన్నాడు. రుణమాఫీలు సాధ్యం కాదు అని జగన్ చెప్పినట్టుగానే రైతు రుణమాఫీ ఫైలుపై మొదటి సంతకం చయలేకపోయాడు చంద్రబాబు. ఇక హోదాతో సహా అన్ని విషయాల్లోనూ జగన్‌నే ఫాలో అయ్యాడు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఆలోచనలు, వ్యూహాల విషయంలో జగన్ కంటే చాలా వెనుకబడిపోయాడు చంద్రబాబు. జగన్‌ని ఫాలో అవుతూ కాలం గడిపేశాడు.

అయితే జగన్ పాదయాత్రను అడ్డుకునే విషయంలో మాత్రం ఈ సారి కాస్త ముందడుగేశాడు చంద్రబాబు. కడపలో జనసంద్రం అంటే …‘వైఎస్‌ల సొంత అడ్డానే కదా’ అని లైట్ తీసుకున్నారు బాబు అండ్ కో. ఆ తర్వాత అనంతపురంలో జనహోరు…..చివరికి పచ్చ బ్యాచ్ జనాలు మొత్తం సొంత అడ్డాలా ఫీలయ్యే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా జగన్ జన సునామీని సృష్టించడంతో అసలు ప్రజా సంకల్పయాత్ర గురించి మాట్లాడడమే మానేశారు టిడిపి జనాలు. అయితే ఇప్పుడు 2014 ఎన్నికల్లో అన్ని సీట్లను టిడిపికి కట్టబెట్టిన పశ్ఛిమగోదావరి జిల్లాలో కూడా జగన్‌కి జనహారతులు పట్టేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు, ఎంపిల స్థాయి నాయకుల నుంచి స్థానిక నాయకుల వరకూ వైకాపాలోకి వరుసకట్టారు. అందుకే ఈ సారి కాస్త ముందుగా మేలుకున్నాడు చంద్రబాబు. ఎట్టి పరిస్థితుల్లోనూ తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం జగన్‌కి ఇదే స్థాయి ప్రజాదరణ దక్కకూడదని వ్యూహరచన చేయడానికి సిద్ధమైపోయాడు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా పర్యటన పెట్టుకున్న చంద్రబాబు….అక్కడే స్థానిక టిడిపి నాయకులు, ప్రజాప్రతినిధులతో సుదీర్ఘ భేటీలు వేసి జగన్ ప్రజా సంకల్పయాత్ర ఫ్లాప్ అన్న ముద్ర వేయడానికి వ్యూహం రచించనున్నాడని స్థానిక టిడిపి నాయకులు సంబరంగా చెప్పకుంటున్నారు. అలాగే జగన్ ప్రజా సంకల్పయాత్రలో పాల్గొంటే ప్రభుత్వం నుంచి వచ్చే లాభాలు ఏవీ రావని ప్రచారం చేయాలని కూడా నిర్ణయించారు పచ్చ బ్యాచ్. ప్రజాసంకల్పయాత్ర చివరి జిల్లాల్లో జనాలు రాకుండా చేసి మొత్తంగా జగన్ పాదయాత్ర ఫ్లాప్ అన్న ముద్రవేయాలనుకుంటున్న చంద్రబాబు వ్యూహం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలని రాజకీయ విశ్లేషకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జగన్‌కి వస్తున్న ప్రజాదరణను అడ్డుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అవుతాడో? లేక చంద్రబాబు వ్యూహాలను చిత్తు చేసి జగన్ తన జనప్రభంజనాన్ని కొనసాగిస్తాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -