Friday, May 17, 2024
- Advertisement -

ఏం చేసినా పార్టీ కోసమేగా…. అధికారం కావాలి… అండగా నిలవరాః బాబు

- Advertisement -

తెరవెనుక చేసుకున్న ఒప్పందాలు బెడిసికొట్టడంతో మరోసారి ఓటుకు కోట్లు కేసును తెరపైకి తెచ్చాడు కెసీఆర్. ఆ వెంటనే పచ్చ బ్యాచ్ మొత్తం అలర్ట్ అయిపోయారు. మొత్తం మోడీయే చేయిస్తున్నాడన్న పాట మొదలెట్టారు. అయితే టిడిపిలో ఉన్న ఏ ఒక్క నాయకుడు కానీ, పచ్చ మీడియా జనాలు కానీ ఎవ్వరూ కూడా చంద్రబాబు ఏ తప్పూ చేయలేదు అని మాత్రం చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఈ విషయమే చంద్రబాబుకు కోపం తెప్పించింది. నిన్నంత కూడా వరుసగా టిడిపి మంత్రులు, నాయకులు, భజన మీడియా జనాలతో వరుసగా భేటీలు వేసిన చంద్రబాబు ప్రజల్లో తన ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా ఎమని ప్రచారం చేయాలి? ఎలా ప్రచారం చేయాలి అని వ్యూహ రచన చేశారు. ఇక ఈ ఓటుకు కోట్లు వ్యవహారాన్ని తెరవెనుకనే కెసీఆర్‌తో సెటిల్ చేసుకోవడం ఎలా అన్న విషయాలపై కూడా మంతనాలు జరిపారు. ఈ విషయాలన్నీ కూడా స్వయంగా టిడిపి నేతలే చెప్పుకొచ్చారు.

అయితే ఈ మీటింగ్స్ సందర్భంగానే పార్టీ నాయకులు, మీడియా జనాలతో చంద్రబాబు అన్న ఒక మాట మాత్రం అందరినీ షాక్‌కి గురిచేసింది. ఏం చేసినా పార్టీ కోసమే చేశాను కదా? తాను కష్టపడి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని అధికారంలోకి తెచ్చా. ఆ అధికారాన్ని మీరంతా అనుభవిస్తున్నారు. ఇక తెలంగాణాలో కూడా టిడిపిని అధికారంలోకి తేవాలనే వ్యవహారాలన్నీ నడిపాను. తెలంగాణాలో కూడా వ్యూహం సక్సెస్ అయ్యి అధికారంలోకి వచ్చి ఉంటే ఆ అధికారాన్ని కూడా మీరే అనుభవించి ఉండేవారు. అయితే కెసీఆర్ తన వ్యూహాన్ని చిత్తు చేయడంతో ఇలా దొరికిపోయాం. ఈ నేపథ్యంలో చంద్రబాబుది ఏమీ తప్పులేదు అని మీరు బలంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు. మోడీయే అంతా చేయిస్తున్నాడు, జగనే కుట్రలు చేయించి బాబును దెబ్బతీయాలని చూస్తున్నాడులాంటి ప్రచారం ఒకే…… దాంతో పాటు చంద్రబాబు తప్పేమీలేదు…… అసలు ఆ బ్రీఫ్డ్ మీ వాయిస్ బాబుదే కాదు అని బలంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు అని చంద్రబాబు నిలదీశాడు. దాంతో బాబు మాటలు విన్న జనాలందరూ ఆశ్ఛర్యపోయారు. ఆడియో, వీడియో సాక్ష్యాలతో దొరికిపోయాక కూడా తప్పులేదు అని మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారని ఒకరిద్దరు సౌమ్యంగా చెప్పాలని ప్రయత్నించినప్పటికీ చంద్రబాబు మాత్రం బాబు ఏ తప్పూ చేయలేదు, నిప్పులా బ్రతికాడు అన్న ప్రచారాన్ని కూడా బలంగా చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. ఇప్పటి వరకూ అయితే ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు తప్పు ఏమీ లేదు అని చెప్పిన పచ్చ బ్యాచ్ జనాలు ఎవ్వరూ లేరు. ఇక ముందు ఈ సరికొత్త ప్రచారాన్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్తారో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -