Friday, March 29, 2024
- Advertisement -

చంద్రబాబు ఎంత చెప్పిన ఈ ట్రిక్స్ ఆపడా..?

- Advertisement -

చంద్రబాబు కి ఆంధ్రప్రదేశ్ లో ఎలా రాజకీయం చేయాలో అర్థం కావట్లేదు.. ఓ వైపు ప్రజలంతా కలిసి ఆయన్ని దారుణంగా ఓడించారు.. మరోవైపు అమరావతి లో ని ప్రజలను మోసం చేసి రాజధాని ని అభివృద్ధి చేయకుండా అక్కడినుంచి తరలించేలా చేశారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకునే తమ్ముళ్లు ఒక్కరు కూడా లేకుండా పోయారు. చంద్రబాబు అయితే హైదరాబాద్ లోని తన నివాసం నుండి బయటకు రాలేదు.. లోకేష్ సంగతి చెప్పనవసరం లేదు.. మామూలుగానే బయటకి రాడు.. ఇక కరోనా సమయంలో అయితే గుమ్మం నుండి బయటకు రాలేదు.. అంతా సద్దుమణిగాక చంద్రబాబు అండ్ కో బయటకి వచ్చి పార్టీ కార్యకలాపాలు జోరుగా మొదలుపెడుతున్నారు..

గత ఎనిమిది నెలలుగా రాష్ట్రాన్ని, పార్టీ ని గాలికి వదిలేసి ఇప్పుడు పార్టీ ని బలోపేతం చేయాలనీ హడావుడి చేయడం చంద్రబాబు కు విజ్ఞత కే వదిలేయాలి. రాష్ట్రంలోని ఏ సమస్య ని అయన పట్టించుకోలేదు.. కనీసం బీజేపీ, జనసేన పార్టీ లు అయినా కొంత ప్రజల్లోకి వెళ్ళడానికి ట్రై చేశాయి కానీ టీడీపీ మాత్రం ఎక్కడి దొంగలు అక్కడనే అన్నట్లు వ్యవహరించింది.. అప్పుడప్పుడు వచ్చినా పెద్దగా ఉపయోగం లేని పనులే చేశారు.. ఇప్పటికే ప్రజలు తమవైపే అన్నట్లు మాట్లాడడం వారి రాజకీయం ఎలా ఉందొ అర్థమవుతుంది..

తమపైన ఏ విమర్శ వచ్చినా కూడా తెలివిగా తెలుగు జనాల మీదకు మళ్ళించడంలో టీడీపీ తమ్ముళ్ళు నిపుణులు. తెలుగుదేశం మీద ప్రత్యర్ధులు విమర్శలు చేస్తే ఇది తెలుగు జాతి మీద దాడి అని అనగలిగే ఏకైక పార్టీ టీడీపీ ఒక్కటే. ఇపుడు తెలుగుదేశం పార్టీ ఈ ప్రచారాన్ని ఎంచుకుంది. దాన్ని జనంలోకి పోనిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని కూడా ఆశపడుతోంది. జనం ఎవరు వైపు ఉన్నారో లోకమంతా చాటాక కూడా వారు మా వైపే అంటూ హిప్నటైజ్ చేస్తూ టీడీపీ కొత్త పాలిట్రిక్స్ నే ఏపీలో చూపిస్తోంది. మరి దీనికి ధీటుగా వైసీపీ నుంచి రియాక్షన్స్ ఉంటాయా అన్నదే ఇక్కడ పాయింటే.

చంద్రబాబుకు మొండివైఖరి ఎంటి..?

చంద్రబాబు తీరు టీడీపీ ఎమ్మెల్యేల కు నచ్చలేదా..?

చంద్రబాబు 40 ఇయర్స్ రాజకీయం ఇదేనా…?

చంద్రబాబు ఇలాంటి రాజకీయాలు ఎవరికోసం..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -