Saturday, April 27, 2024
- Advertisement -

RT68: బాలయ్య కోసం అనుకున్న టైటిల్ ఎగరేసుకెళ్లాడు..!

- Advertisement -

రవితేజ కొత్త గా నటిస్తున్న సినిమాకు రామారావు అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఆన్ డ్యూటీ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాను నూతన దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తుండగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమా బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఇవాళ ఈ సినిమా టైటిల్ కన్ ఫర్మ్ చేయడంతోపాటు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.

ఈ సినిమాలో రవితేజ ఎమ్మార్వో గా నటిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అవినీతిపై ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు రామారావు అనే టైటిల్ పెట్టడం పై అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అది బాలయ్య నటించే సినిమాకు టైటిల్ అని అనుకున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలకృష్ణ తో ఓ సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.

ప్రస్తుతం అనిల్ ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ముగిసిన వెంటనే ఆయన బాలయ్య తో ఓ సినిమా చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం కథ కూడా సిద్ధం చేశారు. దీనికి టైటిల్ రామారావు గారు అని కూడా పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది అఫీషియల్ గా కన్ఫార్మ్ చేయకముందే రవితేజ సినిమాకు రామారావు అనే టైటిల్ పెట్టడం ప్రస్తుతం సంచలనంగా మారింది.

Also Read

తలుపులు తెరుచుకున్న ‘ధర్మస్థలి’..!

చైతూ, నాని సినిమాల విడుదల ఎప్పుడంటే..!

సలార్ మూవీలో వాణీ కపూర్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -