Monday, April 29, 2024
- Advertisement -

రజినీ మక్కల్ మండ్రం రద్దు..!

- Advertisement -

రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెలరేగిన పుకార్లకు తలైవా ఫుల్ స్టాప్ పెట్టారు. ఇవాళ అభిమానులతో సమావేశమైన రజినీకాంత్ తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. రాజకీయాల కోసం ఏర్పాటుచేసిన రజినీ మక్కల్ మండ్రం ఇక అవసరం లేదని, రాజకీయ కార్యకలాపాల కోసమే దానిని ఏర్పాటు చేశానని.. రాజకీయాల్లోకి రావడం లేదని నిర్ణయం తీసుకున్న తర్వాత రజినీ మక్కల్ మండ్రం ఎందుకని దానిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ స్థానంలో రజినీ అభిమానుల సంక్షేమ సంఘం స్థాపిస్తునట్లు చెప్పారు.

గత ఏడాది ఆరంభంలో తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజినీకాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన పలు సార్లు అభిమానులతో సమావేశమై రాజకీయ పార్టీ ఏర్పాటు పై చర్చలు జరిపారు. రాజకీయాల్లోకి కచ్చితంగా వస్తానని అతి త్వరలోనే పార్టీ పేరు, సిద్ధాంతాలు ప్రకటిస్తానని రజినీకాంత్ తెలిపారు. అయితే ఆ తర్వాత తలెత్తిన కొన్ని పరిస్థితుల కారణంగా అనూహ్యంగా రాజకీయాల్లోకి రావడం లేదంటూ ప్రకటించి అభిమానులను నిరాశ పరిచారు.

అయితే ఆయన పార్టీ పెట్టే ముందు తమిళనాడులో తీవ్రస్థాయిలో కరోనా వ్యాపించింది. రజినీకి సైతం కరోనా రావడంతో హైదరాబాద్ లో చికిత్స తీసుకున్నారు. వైరస్ వ్యాప్తి దృష్ట్యా, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రాజకీయాలు వద్దని కుటుంబ సభ్యులు ఒత్తిడి తేవడంతో తానిక రాజకీయాల్లోకి రానని రజినీ ప్రకటించి సంచలన ప్రకటన చేశారు. అనంతరం తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో డీఎంకే కూటమి విజయం సాధించి స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు.

ఇదిలా ఉండగా గత నెల 19వ తేదీన రజినీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లారు. కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకొని 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్కడి మయో క్లినిక్ లో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అయితే వైద్యపరీక్షల్లో ఆయనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, మరో ఐదేళ్ల పాటు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు. అనంతరం కొద్ది రోజులు అమెరికాలోనే విశ్రాంతి తీసుకున్న తర్వాత రజినీకాంత్ తిరిగి ఇటీవల ఇండియాకు చేరుకున్నారు.

వచ్చీ రాగానే ఆయన ఈనెల 12వ తేదీన రజినీ మక్కల్ మండ్రం నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తమిళనాడు లో అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకే రజినీ అభిమానులతో సమావేశం అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆరోగ్యపరంగా కూడా తలైవా ఫిట్ గా ఉండడంతో కచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తారని అంతా భావించారు. ఈ నేపథ్యంలో ఇవాళ చెన్నైలో రజినీకాంత్ తన అభిమానులతో సమావేశం నిర్వహించారు.

అయితే అందరూ ఊహించని విధంగా రజినీకాంత్ రాజకీయాల నుంచి శాశ్వతంగా వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజకీయాల్లోకి రానప్పుడు రజినీ మక్కల్ మండ్రం కూడా అవసరం లేదని దానిని కూడా రద్దు చేశారు. ఆ స్థానంలో రజినీ అభిమానుల సంక్షేమ సంఘం స్థాపిస్తునట్లు ప్రకటించారు. రాజకీయాలపై రజినీకాంత్ చేసిన ప్రకటన తమిళనాడులో మరోసారి సంచలనం సృష్టించింది.

Also Read


ఆనందయ్యకు ఎమ్మెల్సీ.. ఏపీ సీఎస్ కు గవర్నర్ కార్యదర్శి లేఖ..!

థర్డ్​వేవ్​ వచ్చేస్తోందా? భయపెడుతున్న కొత్త వేరియంట్లు..!

జగన్​ సర్కార్​పై వకీల్​సాబ్​ సీరియస్​?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -