‘దృశ్యం’ రిజెక్ట్​ చేసిన రజనీకాంత్​? కారణం ఏమిటంటే?

జీతూ జోసెఫ్​ మలయాళంలో తెరకెక్కించిన దృశ్యం సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనేక భాషల్లో ఈ చిత్రం రీమేక్​ అయ్యి అక్కడ కూడా సక్సెస్​ అయ్యిందంటే ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగా ఇష్టపడ్డారో? ఆ కథతో ప్రేక్షకులు ఎంత కనెక్ట్​ అయ్యారో తెలుస్తుంది. ఇక మలయాళంలో మోహన్​లాల్, తమిళంలో కమల్ హాసన్ , తెలుగులో వెంకటేశ్​ నటించి మెప్పించారు. అయితే ఈ మూవీకి సంబంధించి ఇప్పుడో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

అదేమిటంటే దృశ్యం సినిమా మలయాళంలో విడుదల అయి హిట్ కాగానే తమిళ, తెలుగు భాషల్లో రజనీకాంత్​తో రీమేక్ చేయాలని భావించారట. అందుకు రజనీకాంత్ కూడా ఒప్పుకున్నాడు. కానీ ఆఖరినిమిషంలో ఈ మూవీ రిజెక్ట్​ చేశారట. కారణం ఏమిటంటే.. తమిళంలో కళైపులి థాను ఈ చిత్రాన్ని నిర్మించాలని భావించాడు. డైరెక్టర్​గా మలయాళంలో తెరకెక్కించిన జీతూ జోసెఫ్​నే దర్శకుడిగా అనుకున్నారు.

అయితే రజనీకాంత్​ తెలుగు, తమిళంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అనుకోకుండా తెలుగు హక్కులు వెంకటేశ్​ కొనుగోలు చేశాడు. దీంతో ఈ చిత్రం కేవలం తమిళంలో విడుదల చేస్తే ఆశించిన లాభాలు రావని భావించిన రజనీ ఈ ప్రాజెక్ట్​ నుంచి తప్పుకున్నారట. దీంతో ఇది కమల్​ హాసన్​ చేతిలోకి వెళ్లిపోయింది.

ఇటీవల మలయాళంలో విడుదలైన దృశ్యం -2 కూడా సూపర్​ హిట్ అయ్యింది. దీంతో ఈ సీక్వెల్​ను కూడా మళ్లీ తెలుగు, తమిళంలో తెరకెక్కిస్తున్నారు. తెలుగు వెర్షన్ ఇప్పటికే వెంకీ పూర్తి చేశాడు. తమిళ దృశ్యంలో కమల్ కు జంటగా గౌతమి నటించగా.. ఈ సారి ఆమె స్థానంలో మీనా నటించబోతున్నది.

Also Read

సోనూ సూద్​ .. చెర్రీ మధ్య భీకర ఫైట్..! ప్లాన్ చేసిన కొరటాల..!

సోషల్ మీడియా సినీ ఇండస్ట్రీకి ప్లస్సా.. మైనస్సా..!

తలుపులు తెరుచుకున్న ‘ధర్మస్థలి’..!

Related Articles

Most Populer

Recent Posts