ప్రస్తుతం తెలంగాణాలో రాజకీయాలు వేడేక్కి పోతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన పదవి, పార్టీ సభ్యత్వానికి గుడ్ బాయ్ చెప్పిన విషయం తెలిసిందే. అంతే కాదు ఈ నెల 13న బీజేపీలో చేరనున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కూడా కాషాయ తీర్ధం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతుంది. ఆయన తో పాటు తెలంగాణలో పలువురు నేతలు సైతం బీజేపీ కండువ కప్పుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. కొందరు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత కొంత కాలంగా తాను ఏ బీజేపీ నేతలను కలవలేదని.. ఇలాంటి వార్తలు ఎందుకు పుట్టుకు వస్తున్నాయో తనకు అర్థం కావడం లేదని అన్నారు.
రాజకీయంగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని గతంలోనే చెప్పాన్న రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు చేసే సమయం కాదని.. ప్రజలు కరోనాతో కష్టాలు పడుతున్నారని దాని గురించి ఆలోచించాలని అన్నారు.
వీళ్లు మారరు.. దెయ్యం పట్టిందని యువకుడిని కొట్టి చంపిన భూతవైద్యుడు!