తెలుగు ఇండస్ట్రీలో నిత్యం వివాదాలతో కాపురం చేసే డైరెక్టర్ ఎవరంటే ముందుగా చెప్పుకోవల్సింది రక్తచరిత్ర వర్మ. అన్ని సిమాల డైరెక్టర్లు తమ సినిమా పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చు చేస్తే….వర్మమాత్రం సినిమా వివాదంతో ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకోవడంలో దిట్ట . తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మీద రాష్ట్రవ్యాప్తంగా రచ్చ రచ్చ జరుగుతోంది.
దగా దగా.. మోసం.. నమ్మించి నమ్మించి వెన్నుపోటు పొడిచారు.. వంచించి వంచించి.. వెన్నుపోటు పొడిచారు.. కుట్ర కుట్ర కుట్ర’ అంటూ సాగే వెన్నుపోటు పాటని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు వర్మపై భగ్గు మంటున్నారు. దిష్టి బొమ్మలను తగల బెట్టడంతో పాటు పోలీస్టేషన్లలో కేసులు పెట్టారు.
వర్మ ఊరుఉంటాడా…ఈ సారి ఏకంగా చంద్రబాబునే ముగ్గులోకి లాగారు. నేను CBN గారిని డైరెక్ట్ గా ఒక్కమాట కూడా అనలేదు. అలాంటిది నా మీదే కేసులు పెడితే డైరెక్టుగా దూషించిన ఈ క్రింది వీడియోలోని వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టాలి ?” అంటూ ట్వీట్ చేసి చంద్రబాబుపై ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియోను ఆర్జీవీ పోస్ట్ చేశాడు. ఇది ఇప్పుడు సోషియల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి టీడీపీ నాయకులు వర్మకు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి..?