Thursday, May 16, 2024
- Advertisement -

జగన్‌ని నిలబెట్టేది ఈ పథకమేనా!

- Advertisement -

మనిషి జీవన పోరాటం ఉండటానికి ఇళ్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట. మనిషి ఎంత కష్టపడ్డ అది దీని కోసమే. ప్రస్తుత కాలంలో వీటితో పాటు పిల్లలకు విద్య,వైద్యం కూడా చేరింది. తాము కష్టపడ్డాం తమ బిడ్డలైనా మంచిగా బ్రతకాలని తల్లిదండ్రులు పడే వ్యధ అంతా ఇంతకాదు. ఆ బాధను అర్ధం చేసుకుని ప్రజలకు మంచి చేసే వారే నిజమైన నాయకుడు కాదు సేవకుడు అవుతారు. ఇప్పటికే పేదల ఇంటి కష్టాన్ని తీర్చిన జగన్‌…పేద ప్రజల కోసం విద్య, వైద్యాన్ని ప్రాధాన్యతగా తీసుకుని మందుకుసాగుతున్నారు. విద్యలో జగన్ సర్కార్ తీసుకొచ్చిన సంస్కరణలు మంచి ఫలితాన్నిస్తున్నాయి.

ఇక తాజాగా వైద్యంపై దృష్టి సారించింది వైసీపీ. ఇందులో భాగంగా ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్‌తో ప్రజల ముందుకొచ్చింది. మారుమూల గ్రామాల్లోనూ ఉండే పేదల కోసం ఈ పథకానికి శ్రీకారం చుట్టగా సత్ఫలితాన్నిస్తోంది. ప్రజల నుండి మంచి స్పందన వస్తుండగా రెగ్యులర్ గా ప్రజల ఇంటికే వెళ్లి వారి హెల్త్ చెకప్ చేస్తుండటం వల్ల అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య తగ్గుతోంది.

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు డాక్టర్లు ఆస్పత్రుల్లో ఓపీ చూస్తారు. మధ్యాహ్నం నుంచి 104 వాహనంలో డాక్టర్ ఊరిలోకి వెళ్తారు. కదలలేని రోగులు, వృద్ధుల వద్దకు వెళ్లి పరీక్షలు చేస్తారు. మందులు అందిస్తారు. ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో భాగంగా పి.హెచ్.సి. లలో పనిచేసే ఇద్దరు వైద్యులకు ఆ పరిధిలో ఉన్న సచివాలయాలను కేటాయిస్తారు. ఒక వైద్యుడు ఆస్పత్రిలో ఉంటే, ఇంకో వైద్యుడు 104 వాహనంలో గ్రామంలోకి వెళ్లి సేవలందిస్తారు. ఆ డాక్టర్ తోపాటు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ లోని మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌, సచివాలయ ఏఎన్‌ఎం, ఆశ వర్కర్‌ కూడా 104 వాహనం ద్వారా గ్రామంలోకి వెళ్తారు.

ఏ వాహనం ఏరోజు, ఏ సచివాలయ పరిధిలో ఉంటుందో ముందుగానే ప్రకటిస్తారు. ఇలా గ్రామంలోని ప్రతి ఒక్కరి ఇంటికి డాక్టర్ వెళ్లేలాగా ఈ కార్యక్రమం రూపొందించారు. ఇలా ప్రతి ఇంటికి నెలలో రెండుసార్లు డాక్టర్ వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. ఈ పథకంతో జగన్ సర్కార్‌కు మంచి మార్కులు పడుతున్నాయి. ఇప్పటికే నవరత్నాలతో ప్రజలకు చేరువయ్యారు జగన్.

వైఎస్సార్ రైతు భరోసా,వైఎస్సార్ ఆరోగ్యశ్రీ,అమ్మఒడి,,పింఛన్ల పెంపు,పేదలందరికీ ఇళ్ళు,ఫీజు రీయింబర్స్ మెంట్,వైఎస్సార్ జలయజ్ఞం, మద్యపాన నిషేధం,వైఎస్సార్ ఆసరా , వైఎస్సార్ చేయూత పథకాలతో జగన్ ఇమేజ్ ప్రజల్లో పెరుగగా ఫ్యామిలీ డాక్టర్‌తో మరింత పాపులారిటీ పెరిగిపోయింది. ఈ ఒక్క పథకం చాలు జగన్ సర్కార్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని పలువురు విశ్లేషిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -